Site icon HashtagU Telugu

Nag Aswin : కల్కి 2 భాగాలు.. చిట్టిలు వేసి డిసైడ్ చేశారా..?

Kalki 2 Parts Nag Aswin Decides Its Like That

Kalki 2 Parts Nag Aswin Decides Its Like That

కల్కి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Aswin) నెటిజ్ఞలను ఒక ఆట ఆడుకుంటున్నాడు. అదేంటి అంటే తన ఫన్నీ థింగ్స్ అన్నిటినీ షేర్ చేస్తూ ఆటపట్టిస్తున్నాడు. లేటెస్ట్ గా కల్కి (Kalki) రెండు భాగాలు ఎలా చేశాడో క్లారిటీ ఇస్తూ ఒక ఫన్నీ వీడియో పెట్టాడు. కల్కి సినిమా మొదట ఒక సినిమాగానే చేయాలని అనుకున్నారు. కానీ పాత్రలు.. ఆ సెటప్ అంత బాగా వస్తుండటం వల్ల రెండు భాగాలుగా ప్లాన్ చేశారు.

ఐతే కల్కి ఒక సినిమాగానా రెండు భాగాలుగానా అన్న సందేహం ఉన్న టిం లో నాగ్ అశ్విన్ చిట్టిలు వేసి డిసైడ్ చేశారట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు నాగ్ అశ్విన్. చూస్తుంటే ఇది కామెడీ కోసమే అని అనిపిస్తుంది. ఐతే చిట్టిలు వేసి డిసైడ్ చేసేంత కామెడీగా అయితే కల్కి ని నిర్ణయించి ఉండరని అంటున్నారు.

నాగ్ అశ్విన్ మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా చేశాడు. ఆ సినిమాతోనే తనలోని స్టోరీ టెల్లర్ ని చూపించాడు. ఇక సెకండ్ సినిమాగా మహానటి (Mahanati) తీశాడు. కీర్తి సురేష్ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ కూడా వచ్చింది.

ఇక ఇప్పుడు కల్కితో 1000 కోట్ల సినిమా ప్రేక్షకులకు అందించాడు. కల్కి సినిమా సెకండ్ పార్ట్ మరింత భారీగా ఉండబోతుందని అర్ధమవుతుంది. కల్కి సినిమాటిక్ యూనివర్సిటీ రెండో భాగం తోనే ఆగుతుందా ఇంకా కొనసాగుతుందా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. వైజయంతి మూవీస్ నిర్మించిన కల్కి సినిమా రెండో భాగానికి కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు.

Also Read : Anasuya : పవన్ తో అనసూయ.. సాంగ్ అదిరిపోతుందట..!