Site icon HashtagU Telugu

Kajol : ఘోస్ట్ హౌస్ లా అనిపించింది.. రామోజీ ఫిల్మ్ సిటీపై కాజోల్ షాకింగ్ కామెంట్స్!

Kajol, Ramoji Film City

Kajol, Ramoji Film City

Kajol : దేశంలోనే అత్యంత అద్భుతమైన సినిమా కాంప్లెక్స్‌గా గుర్తింపు పొందిన రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు ఒక హర్రర్ స్టోరీని తలపిస్తోంది. ఈ ట్విస్ట్‌కు కారణం బాలీవుడ్ స్టార్ నటి కాజోల్ చేసిన సంచలన వ్యాఖ్యలు.. ప్రస్తుతం తన తాజా సినిమా ‘మా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కాజోల్‌కి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న వచ్చింది.. “ఒక వింత అనుభూతి కలిగిన షూటింగ్ లొకేషన్ ఏదైనా ఉందా?” అని.
దీనికి ఆమె స్పందన కాస్త ఆశ్చర్యకరంగా మారింది. “షూటింగ్‌కు వెళ్తే సరే కానీ… కొన్ని లొకేషన్స్ మాత్రం భయానకంగా, నెగెటివ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అలాంటిదే. నేను అక్కడ షూటింగ్ చేసిన రోజులంతా అసహనం, అసౌకర్యం అనిపించింది. అక్కడి వైబ్స్ హాంటెడ్ హౌస్‌లా ఫీల్ అయ్యాయి. ఇకపై అక్కడ షూట్ చేయడం అంటే నాకు నో ఛాన్స్!” అని చెప్పింది.

ఈ వ్యాఖ్యలతో బీటౌన్‌లోనూ, టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ మొదలైంది. “ఇది కాజోల్ వ్యక్తిగత ఫీలింగ్ మాత్రమేనా? లేక ఇంకేదైనా కథ ఉందా?” అనే చర్చ నెట్టింట్లో ఉధృతమవుతోంది. అసలు ఈ ఫిల్మ్ సిటీని దేశ-విదేశాల ఫిల్మ్ మేకర్స్ “సినీ మాయాజాలానికి మకుటం” అని పొగడ్తలతో ముంచెత్తారు. వందలకోట్లతో నిర్మించిన సెట్లు, ఏ సినిమా అయినా అక్కడే పూర్తవుతుంది అన్న ఫెసిలిటీస్‌తో, టెక్నీషియన్లు ఇది భారతీయ సినిమా ఇండస్ట్రీకి ఓ అద్భుతం అని చెబుతుంటారు.

కానీ ఈ స్థాయిలో ఒక నటి.. అదీ కాజోల్ లాంటి సీనియర్ స్టార్.. ఇలా పబ్లిక్‌గా “ఘోస్ట్ హౌస్ లా ఉంది” అని చెప్పడాన్ని కొంతమంది నెటిజన్లు తేలికగా తీసుకోవడం లేదు. “అవును, నిజంగా RFC haunted అనిపించిందా? లేక ఇది ఏదైనా టార్గెట్ చేసిన కామెంట్?” అని ప్రశ్నిస్తున్నారు.

రామోజీ ఫిలిం సిటీలో ఒక్క కాజోల్‌కే కాదు, తాప్సీ, రాశీఖన్నా, కీరవాణిలకూ భయానక అనుభవాలు ఎదురయ్యాయట. తాప్సీ ఓసారి హోటల్ గదిలో ఒంటరిగా ఉండగా నడక శబ్ధాలు వినిపించాయని చెప్పింది. రాశీఖన్నా కూడా బెడ్ ఊగినట్టు, దుప్పటి లాగినట్టు అనిపించిందని వెల్లడించింది. కీరవాణి మాట్లాడుతూ, సింఫనీ స్టూడియోలో సింగర్స్ చెవిలో వింత శబ్ధాలు వినిపించాయని చెప్పారు. సెలబ్రిటీలు ఇలా ఓపెన్‌గా చెప్పడాన్ని బట్టి రామోజీ ఫిలిం సిటీలో ఏదో ఉందని నెటిజన్లు అనుకుంటున్నారు. కానీ ఇందులో ఎంత వాస్తవం ఉందనే.. రాబోయే రోజుల్లో చూడాలి..

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం