Kajal : కాజల్ పేరే వినిపించడం లేదు పాపం

కాజల్ రీ ఎంట్రీ మాములుగా ఉండదు అని, పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని .. ముఖ్యంగా బాలయ్యకు జోడి అంటే .. కనీసం డ్రీమ్ లోనైనా ఒక మాస్ సాంగ్ ఉంటుంది అనుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Kajal Bhagavnath

Kajal Bhagavnath

సినీ నటి కాజల్ (Kajal)..ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మి కళ్యాణం (Lakshmi Kalyanam ) మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైనప్పటికీ మగధీర చిత్రం అమ్మడిని పాపులర్ చేసింది. రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు సృష్టించింది. ఈ సినిమా తర్వాత కాజల్ వరుస అగ్ర హీరోల పక్కన జోడి కడుతూ అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరింది. పెళ్లి చేసుకునేంతవరకు కూడా కాజల్ కు వరుస అవకాశాలు వచ్చాయి. పెళ్లి , తర్వాత ఓ బిడ్డకు జన్మనివ్వడం ఈ గ్యాప్ లో సినిమాలకు దూరమైంది.

We’re now on WhatsApp. Click to Join.

రీసెంట్ గా బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ దసరా సందర్బంగా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కాకపోతే కాజల్ అభిమానులు మాత్రం చాల నిరాశలో ఉన్నారు. కాజల్ రీ ఎంట్రీ మాములుగా ఉండదు అని, పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని .. ముఖ్యంగా బాలయ్యకు జోడి అంటే .. కనీసం డ్రీమ్ లోనైనా ఒక మాస్ సాంగ్ ఉంటుంది అనుకున్నారు. అంతే కాదు ఈ సినిమా తరువాత కాజల్ టాలీవుడ్ లో బిజీ అవుతుందని, సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని అనుకున్నారు. ఇలా ఎన్నో అనుకున్నారు కానీ వాటి అన్నింటిపై అనిల్ రావిపూడి నీళ్లు చల్లాడు. ఆమె పాత్ర ఏమాత్రం గొప్పగా లేదు. సినిమా మొత్తం కేవలం 5 సీన్స్ కు మాత్రమే పరిమితమైంది. అది కూడా కామెడీకి మాత్రమే. దీంతో కాజల్ సినిమా మీద పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలు గా మారాయి.

సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా.. అందరు బాలయ్య, శ్రీలీల గురించే చర్చించుకుంటున్నారు తప్ప కాజల్ పేరే చెప్పడం లేదు. అసలు ఈ సినిమాలో కాజల్ ను ఎందుకు పెట్టారు అనేది కూడా చాలామందికి అర్ధం కాకుండా పోయింది. సినిమా చూసిన కాజల్ ఫ్యాన్స్.. అనిల్ రావిపూడిపై ఫైర్ అవుతున్నారు.. రీ ఎంట్రీ అంటే .. కాజల్ కు మంచి లెంత్ ఉండే పాత్ర, గుర్తుండిపోయే పాత్ర ఇస్తావనుకున్నాం..కాజల్ కు అంత అన్యాయం చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

Read Also : Game Changer : దసరా కు మెగా సర్ప్రైజ్ లేనట్లేనా..?

  Last Updated: 22 Oct 2023, 09:10 AM IST