Kadambari Kiran: మరొకసారి గొప్ప మనసును చాటుకున్న కాదంబరి కిరణ్.. వరుస సహాయలతో బిజీ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు కాదంబరీ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు కాదంబరి కిరణ్. ఇటీవల కాలంలో తరచూ ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ వరుసగా సహాయాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు కాదంబరీ కిరణ్. మనం సైతం ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు, అలాగే అవసరాల్లో […]

Published By: HashtagU Telugu Desk
Kadambari Kiran

Kadambari Kiran

తెలుగు సినీ ప్రేక్షకులకు నటుడు కాదంబరీ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపుని ఏర్పరచుకున్నారు కాదంబరి కిరణ్. ఇటీవల కాలంలో తరచూ ఈయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతూనే ఉంది. సినిమాలలో నటించకపోయినప్పటికీ తరచూ వరుసగా సహాయాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు కాదంబరీ కిరణ్. మనం సైతం ఫౌండేషన్ ద్వారా సినీ పరిశ్రమలోని పేద కార్మికులకు, అలాగే అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

కేవలం తన దగ్గరకి సహాయం అంటూ వచ్చిన వారికి మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమలో పని చేసి, ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినీ కార్మికులను వెతుకొని మరి వెళ్లి, వారిని పలకరిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుని మరి వారికీ హెల్ప్ చేస్తున్నారు. మొన్నటికీ మొన్న సీనియర్ నటి, లేడి కమెడియన్ పావలా శ్యామలకు ఆర్థిక సహాయం అందించి గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా కిడ్నీ సమస్యతో పోరాడుతున్న సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్‌కు కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ద్వారా కొంత సహాయాన్ని అందజేశారు. శ్రీనివాస్ రావుకి కిడ్నీలు ఫెయిల్ అవ్వడంత అతని భార్య ఈమని శ్రీదేవి ఒక కిడ్నీని ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

Also Read: Mrunal Thakur: ప్రేక్షకులకు పాదాభివందనం చేసిన మృణాల్ ఠాకూర్.. వీడియో వైరల్!

అయితే ఆ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కావాల్సిన ఖర్చు వారి దగ్గర లేదు. ఆ రూ.25,000 ఖర్చునే కాదంబరి కిరణ్ ఈమని శ్రీనివాస్‌ కుటుంబానికి అందజేశారు. దాంతో ఆ కుటుంబం కాదంబరి కిరణ్ చేసిన సహాయంతో ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా కిరణ్ ఇక గత వారం సినీ రైటర్ భరత్ కుమార్ కుటుంబానికి కూడా రూ.25,000 సాయం అందించారు. అలాగే సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై రవి కుమార్ కుటుంబానికి రూ.25,000, సీనియర్ జర్నలిస్ట్ టిఎల్ ప్రసాద్ కంటి ఆపరేషన్ కోసం రూ.25,000 సహాయాన్ని అందించారు. ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన గొప్ప మనసుని చాటుకుంటున్నారు కిరణ్.

Also Read: Supritha: రాత్రివేళ పబ్బులో అలాంటి పనులు చేస్తున్న సుప్రీత.. చూస్తుండగానే అలా?

  Last Updated: 04 Apr 2024, 12:07 PM IST