Kabzaa 2 : ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తీస్తున్న డైరెక్టర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

'కబ్జ' సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. సినిమా చివర్లో మరో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక సీక్వెల్ ఉండదు అని అందరూ అనుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 14, 2023 / 07:08 PM IST

బాహుబలి, KGF, RRR సినిమాల తర్వాత అందరూ పాన్ ఇండియా సినిమాల మీదే పడ్డారు. ఎలాంటి సినిమా అయినా సరే దానికి కొంచెం ఎలివేషన్స్, స్టార్ క్యాస్ట్ యాడ్ చేసి వేరే భాషల్లో డబ్బింగ్ చేసి పాన్ ఇండియా(Pan India) సినిమా అని ప్రమోట్ చేస్తున్నారు. ఇక కన్నడ సినీ పరిశ్రమలో KGF సినిమా రెండు పార్టులు పెద్ద విజయం సాధించడంతో కొంతమంది అదే జోనర్ లో వెళ్తున్నారు.

ఇటీవల ఉపేంద్ర(Upendra) మెయిన్ లీడ్ లో, శ్రియ(Shriya) హీరోయిన్ గా, కిచ్చ సుదీప్ గెస్ట్ అప్పీరెన్స్ లో ‘కబ్జ'(Kabzaa) అనే ఓ భారీ సినిమాని రిలీజ్ చేశారు. కన్నడ నుంచి మరో పెద్ద సినిమా అంటూ గ్రాండ్ గా పాన్ ఇండియా ప్రమోషన్స్ చేశారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ అయింది. టీజర్స్, ట్రైలర్స్ గ్రాండ్ గా చూపించడంతో ఇది కూడా KGF లా వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకులు సినిమాకు వెళ్తే KGF సినిమానే మళ్ళీ చూసినట్టు అయింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు KGF చూసి ‘కబ్జ’ ని తీశారు. దీంతో సినిమా ఫ్లాప్ అవ్వడమే కాక ఇలాంటి సినిమా తీసినందుకు డైరెక్టర్ ని తీవ్రంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.

అయితే ‘కబ్జ’ సినిమా రిలీజ్ కి ముందే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. సినిమా చివర్లో మరో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఎంట్రీ ఇచ్చి సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఇక సీక్వెల్ ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా డైరెక్టర్ చంద్రు ఈ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మార్చ్ 17న ‘కబ్జ’ సినిమా రిలీజై ఫ్లాప్ అవ్వగా ఇంకా నెల రోజులు కూడా కాకముందే ఈ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేయడం విశేషం.

తాజాగా నేడు ‘కబ్జ 2’ అంటూ మళ్ళీ పాన్ ఇండియా భాషల్లో ఓ పోస్టర్ రిలీజ్ చేసి త్వరలోనే మొదలవ్వబోతుంది అని ప్రకటించాడు డైరెక్టర్ చంద్రు. దీంతో ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఏంట్రా బాబు అని నెటిజన్లు మరోసారి ఆ డైరెక్టర్ ని ట్రోల్ చేస్తున్నారు. కనీసం కన్నడలో అయినా ‘కబ్జ’ సినిమా హిట్ అయి ఉంటే సీక్వెల్ తీయొచ్చు కానీ అక్కడ కూడా ఫ్లాప్ అయినా ‘కబ్జ 2’ అనౌన్స్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతూ, దర్శకుడిని విమర్శిస్తున్నారు. మరి ఈ పార్ట్ 2 ఎలా తీస్తాడో, ఈ సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.

 

Also Read :    Sai Dharam Tej : నాకు బ్రేకప్ అయింది.. ప్రేమ, పెళ్లిపై మెగా మేనల్లుడి కామెంట్స్..