Site icon HashtagU Telugu

Box Office : వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘క’ (KA)

Ka Collections

Ka Collections

బాక్స్ ఆఫీస్ వద్ద కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తున్నాడు. రాజా వారు రాణి గారు (Raja varu Rani Garu) సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే అలరించిన కిరణ్.. ఎస్.ఆర్ కళ్యాణమండపం తో తన మార్క్ చూపించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈమధ్యలో చేసిన సినిమాల్లో వినరో భాగ్యము విష్ణు కథ తప్ప మరో సినిమా ఆడలేదు. అయినా సరే మనోడు వెనక్కి తగ్గలేదు.

తాజాగా ‘క’ (Ka) అంటూ క్రేజీ సినిమాతో ఈరోజు దీవాలి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను సుజిత్, సందీప్ అనే దర్శక ద్వయం డైరెక్ట్ చేసారు. ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్, టీజర్ , ట్రయిలర్ ఇలా ప్రతిదీ సినిమా పై ఆసక్తి పెంచడం తో సినిమా ఎలా ఉండబోతుందో అనే అంచనాలు పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడంతో ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రథంపడుతున్నారు. గత కొద్దీ రోజులుగా సరైన సినిమాలు లేక బాధపడుతున్న సినీ లవర్స్ కు దీపావళి కానుకగా వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడం తో మేకర్స్ , డిస్ట్రబ్యూటర్స్ హ్యాపీ గా ఉన్నారు.

క(Ka) కలెక్షన్స్ విషయానికి వస్తే..

క మూవీ ఫస్ట్ డే ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ. 3.8 కోట్ల కలెక్ట్ చేయగా.. ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ ల్లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. ఇలా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా క మూవీ కలెక్షన్లలో హవా కొనసాగించింది. రెండో రోజు ఇండియన్ బ్యాక్సాఫీస్ రూ.3 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరల్ గా రూ. 6.19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను వరల్డ్ వైడ్‌గా సాధించినట్లు తెలుస్తోంది. మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు కలెక్షన్స్ పెరిగాయి. ఇక క సినిమా 2 రోజుల్లో 13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఇక మూడో రోజు బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్లు కలెక్ట్ చేసింది.

కిరణ్ అబ్బవరం లైఫ్ లో ఎప్పుడు చూడని రికార్డ్ ఇది అని చెప్పాలి. డే 1 కంటె డే 3 ఎక్కువ కలెక్షన్ల కలెక్ట్ చేసి.. కిరణ్ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇలా కిరణ్ అబ్బవరం క సినిమా మూడు రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 10.55 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా క మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూస్తే.. క మూవీ 18 నుంచి 20 కోట్లకు పైగా కలెక్షన్స్ చేసినట్టు తెలుస్తోంది.

Read Also : YCP : రాబోయే ఎన్నికల్లో వైసీపీదే విజయం – విజయసాయి రెడ్డి