Site icon HashtagU Telugu

Ashu Reddy : అషుని ఆపేదెవ్వరు.. గ్లామర్ ట్రీట్ తో దుమ్ముదులిపేస్తున్న జూనియర్ సమంత..!

Junior Samantha Ashu Reddy Another Blasting Photoshoot

Junior Samantha Ashu Reddy Another Blasting Photoshoot

Ashu Reddy బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక బాగా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో కచ్చితంగా ముందు ఉంటుంది అషు రెడ్డి. అంతకుముందు జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో కాస్త హడావిడి చేసే అషు బిగ్ బాస్ వల్ల ఆడియన్స్ కు మరింత దగ్గరైంది. ఇక ఆ తర్వాత అమ్మడు క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. కొన్నాళ్లు స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోలకు యాంకరింగ్ చేసిన అషు రెడ్డి అక్కడ బోర్ కొట్టి బయటకు వచ్చేసింది.

సినిమా ఆఫర్లు వస్తున్నా చేయట్లేదా లేదా అమ్మడికి నిజంగానే ఒక్క ఆఫర్ రావట్లేదా అన్నది తెలియదు కానీ సోషల్ మీడియాని హీటెక్కించేలా అషు చేస్తున్న ఫోటో షూట్స్ మాత్రం ఆమెకు ఆడియన్స్ లో అటెన్షన్ పెరిగేలా చేస్తున్నాయి. అషు ఫోటో షూట్ వచ్చిందంటే చాలు ఒక రేంజ్ లో గ్లామర్ షో ఉన్నట్టే లెక్క.

తన ఫాలోవర్స్ ని ఆ విషయంలో డిజప్పాయింట్ చేయకూడదని ఫిక్స్ అయ్యింది కాబోలు అందుకే అషు ఒకదాన్ని మించి మరోటి అనేలా ఫోటో షూట్ చేస్తుంది.

లేటెస్ట్ గా మరో అదిరిపోయే ఫోటో షూట్ తో వచ్చింది అషు రెడ్డి. స్విజ్జర్లాండ్ లో తను దిగిన క్రేజీ ఫోటో షూట్ ని షేర్ చేసింది అషు రెడ్డి. పైన డెనిం కోట్.. లోపల బ్లూ కలర్ టైట్ ఫిట్ తో అందాలన్నీ కనిపించేలా అమ్మడు దుమ్ము దులిపేస్తుంది. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అంటే అది అషు రెడ్డి వల్లే అవుతుంది అని మరోసారి ప్రూవ్ చేసింది. ప్రస్తుతం అషు రెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Also Read : NTR Devara First Song : హుకుం సాంగ్ మర్చిపోతారట.. నిర్మాత కామెంట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!