Junior NTR Reaction: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR Reaction) హీరోగా.. దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న మూవీ దేవర. ఈ మూవీ ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా సినిమా కావటంతో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ కూడా నటించారు. అయితే ఇటీవల ముంబై, చెన్నైల్లో మూవీ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించిన చిత్రబృందం తాజాగా తెలుగులో కూడా ఈరోజు (సెప్టెంబర్ 22) ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ప్లాన్ చేసింది. అయితే ఈ వేడుకను హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేశారు.
అయితే ఈ ఈవెంట్‌కు అనుకున్న దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావటంతో పోలీస్ భద్రతా సిబ్బందికి ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా వేడుక నిర్వహించాల్సిన ఆడిటోరియంలో కూడా సెలెబ్రిటీలకు సైతం కూర్చునేందుకు ప్లేస్ లేకుండా అభిమానులు వచ్చేశారు. దీంతో ఈవెంట్ నిర్వాహకులు, పోలీసులతో అభిమానులు సరైన ఏర్పాట్లు లేవని వాగ్వాదానికి దిగారు. అంతేకాకుండా హోటల్లోని విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు సైతం అభిమానులను కంట్రోల్ చేయలేమని, సెక్యూరిటీ ఇబ్బందిగా మారిందని ఈవెంట్‌ను రద్దు చేశారు.
Also Read: MLA Pantham Nanaji Apology : క్షమాపణలు కోరిన జనసేన ఎమ్మెల్యే ..రేపు దీక్ష చేస్తానని ప్రకటన
దేవర ప్రీ రిలీజ్ క్యాన్సిల్ పై ఎన్టీఆర్ వ్యాఖ్యలు pic.twitter.com/JCeGxQntrc
— ChotaNews (@ChotaNewsTelugu) September 22, 2024
ఈ క్రమంలోనే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్టీఆర్ స్పందించారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడం బాధాకరం. అభిమానుల కన్నా నేనే ఎక్కువగా బాధపడుతున్నా. షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను అభిమానులతో పంచుకోవాలనుకున్నా. సెక్యూరిటీ కారణాల వల్ల ఈ కార్యక్రమం రద్దు అయ్యింది. ఈ రోజు కలవకపోయినా సప్టెంబర్ 27న కలుద్దాం. ఈ ఈవెంట్ రద్దు ఎవరూ కారణం కాదు. కొరటాల శివ ఈ సినిమాను చాలా అద్భుతంగా తీశారు. అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లారని ఆశిస్తున్నాను. ఇక సెలవు అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఇకపోతే ఈ సినిమాను యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ బ్యానర్‌పైన నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌లు మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి.