Site icon HashtagU Telugu

Jr NTR and Janhvi: క్రేజీ కాంబినేషన్.. ఎన్టీఆర్ తో రొమాన్స్ కు జాన్వీ రెడీ!

Janhvy And Jrntr

Janhvy And Jrntr

బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2018లో ధడక్‌తో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టింది. మిలీ, గుంజన్ సక్సేనా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఆ రెండు సినిమాలు ఆశించినంతస్థాయిలో ఆడలేదు. తాజాగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతోంది. జాన్వీ త్వరలో తన ‘డ్రీమ్ యాక్టర్’ జూనియర్ ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని తెలుస్తోంది.

RRR నటుడితో (ఎన్టీఆర్) కలిసి పని చేయాలనే జాన్వీ కోరిక ఎట్టకేలకు నెరవేరుతున్నట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ 30లో తారక్ సరసన కథానాయికగా నటించేందుకు ఈ నటి ఎంపికైనట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే వారం షూటింగ్ ప్రారంభించి ఏప్రిల్ 2024లో విడుదల కానుంది. ఈ చిత్ర పోస్టర్‌ను ఇటీవల చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఆచార్య ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల (Koratala) చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆ సినిమా ఘోరంగా ఫెయిల్ కావడం, దర్శకుడి వైఫల్యం అని మెగాస్టార్ రెండుసార్లు  చెప్పడంతో కొరటాల డైలమాలో పడిపోయాడు.

#NTR30 సినిమా ఆలస్యమవుతుండటం కూడా హట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభించాల్సి ఉంది.  కానీ కొరటాల పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు (Janhvi Kapoor) గుడ్ లక్ జెర్రీ (OTT విడుదల), మిలీ వంటి బ్యాక్-టు-బ్యాక్ ఫ్లాప్‌లు ఆమెను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో ఆమె తండ్రి బోనీ కపూర్ ఈ సమయంలో తెలుగు అవకాశాలను వదులుకోవడం మంచిది కాదని సూచించినట్టు తెలుస్తోంది. దీంతో జాన్వీ టాలీవుడ్ పై ఫోకస్ చేసినట్టు సమాచారం. ఈ కాంబోను డైరెక్టర్ కొరటాల శివ బాగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

Also Read: Hyderabad Metro: జీతాలు పెంచండి మహాప్రభో!