Site icon HashtagU Telugu

Jr NTR : జపాన్ నుండి క్షేమంగా హైదరాబాద్ కు చేరుకున్న జూ.ఎన్టీఆర్

Ntr Japan

Ntr Japan

నూతన సంవత్సర తొలిరోజు జపాన్ (Japan Earthquake) వరుస భూకంపాలు వణికిపోయింది. ఒకే రోజు దాదాపు 155 భూకంపాలు సంభవించాయి. తొలి భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.6 గా నమోదైనట్లు వాతావరణ కార్యాలయం తెలిపింది. భారీ సునామీ వస్తుందని అనుకున్నా, అదృష్టం కొద్దీ పెద్ద సునామీ రాలేదు. ఐతే, అలలు మాత్రం కొంత ఎగసిపడ్డాయి. ఐతే.. భారీ సునామీ హెచ్చరికను తగ్గించారు. దాంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. జపాన్ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జపాన్ లో భూకంపం అనగానే జూ ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ఖంగారుకు గురయ్యారు..ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వారం కిందట ఎన్టీఆర్ తన ఫ్యామిలీ తో జపాన్ కు వెళ్లడం జరిగింది. అయితే కొత్త ఏడాది మొదటి రోజైన సోమవారం (జనవరి 1) ఏకంగా 155 భూకంపాలు జపాన్ ను వణికించాయి. ఇందులో ఆరుగురు చనిపోయారు. ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అని అభిమానులంతా ఆరాతీయడం మొదలుపెట్టారు. అయితే ఎన్టీఆర్ క్షేమంగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. తాను తిరిగి ఇంటికి చేరుకున్నట్లు సోమవారం (జనవరి 1) అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తో ఫ్యాన్స్ అంతా ఊపిరి పీల్చుకున్నారు.

‘జపాన్ నుంచి ఇవాళే ఇంటికి తిరిగి వచ్చేశాను. అక్కడి భూకంపాల వార్తలు చూసి షాక్ తిన్నాను. గత వారం రోజులు అక్కడే గడిపాను. భూకంపాల వల్ల ప్రభావితమైన అందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అక్కడి ప్రజలు ఎంతో దృఢంగా ఉన్నారు. వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర మూవీ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది.

Read Also : White Hair Tips : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే కొబ్బరి చిప్పతో ఇలా చేయాల్సిందే..