Site icon HashtagU Telugu

Jr NTR : యువ హీరోలని ఎంకరేజ్ చేస్తున్న ఎన్టీఆర్.. మొన్న విశ్వక్.. నేడు సిద్ధూ కోసం..

Jr NTR Encouraging Young Heros NTR Coming to Siddhu Jonnalagadda Tillu Square Success Meet

Jr NTR Encouraging Young Heros NTR Coming to Siddhu Jonnalagadda Tillu Square Success Meet

ఎన్టీఆర్(Jr NTR )ప్రస్తుతం ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవర పార్ట్ 1 అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. అయితే ఎన్టీఆర్ ఇటీవల యువ హీరోలని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు.

గత సంవత్సరం విశ్వక్సేన్(Vishwak Sen) దాస్ కా ధమ్కీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వచ్చి సందడి చేసాడు. విశ్వక్సేన్ ముందు నుంచి కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ అని, ఎన్టీఆర్ తన సినిమా ఈవెంట్ కి రావడం గొప్ప విషయం అని మాట్లాడారు. ఎన్టీఆర్ కూడా విశ్వక్ ని పొగుడుతూ నా అభిమానుల కోసం నేను వస్తాను, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, విశ్వక్ నాకు తమ్ముడి లాంటి వాడు అని కామెంట్స్ చేసాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ మరో యువ హీరో సిద్ధూ జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) కోసం రాబోతున్నాడు. సిద్ధూ, అనుపమ జంటగా డీజే టిల్లుకి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్(Tillu Square) సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. టిల్లు స్క్వేర్ సినిమా ఇప్పటికే 96 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి 100 కోట్లకు దూసుకుపోతుంది. ఇటీవల మూవీ యూనిట్, సిద్ధూ, విశ్వక్ ఎన్టీఆర్ తో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూసారు. సినిమా చాలా నచ్చిందని ఎన్టీఆర్ పోస్ట్ కూడా చేసారు.

ఇప్పుడు ఎన్టీఆర్ ఈ టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కోసం వస్తున్నాడు. సిద్ధూ జొన్నలగడ్డ కోసం ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్నారు ఈ ఈవెంట్ ఏప్రిల్ 8న హైదరాబాద్ లో జరగనుంది. ఎన్టీఆర్ కూడా బయట పబ్లిక్ లో కనపడి చాలా కాలం అయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

 

Also Read : Anupama Parameswaran: మరోసారి రెచ్చిపోయిన టిల్లు బ్యూటీ.. అందం చూస్తే మత్తెక్కాల్సిందే?