Site icon HashtagU Telugu

Jr NTR’s Razakars: ఎన్టీఆర్ ‘ది రజాకార్ ఫైల్స్’

Jr Ntr

Jr Ntr

ఇటీవల తెలంగాణ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ నేటికి చర్చనీయాంశమవుతోంది. వీరిద్దరి భేటీ రాజకీయపరమైనదా? సాధారణమైనదా? అనేది తేలక ఎన్నో చర్చలకు దారితీసింది. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తుకు ఈ భేటీ తొలి అడుగు అనే కోణంలోనూ  వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు అసలు కారణం ఏమిటంటే.. బిజెపి రజాకార్ల ఉద్యమంపై సినిమా తీయాలని ఎప్పట్నుంచో కోరుకుంటుంది. అందులో నటించమని అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌ను కోరారని తెలుస్తోంది. కాశ్మీర్ ఫైల్స్ మాదిరిగా రజాకార్ ఫైల్స్ తెరకెక్కించడం కోసం బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.

బ్రిటీష్ హయాంలో హైదరాబాద్ స్టేట్‌లోని మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (MIM) పార్టీకి రజాకార్లు పారామిలటరీ స్వచ్ఛంద దళం. హైదరాబాదులో ముస్లింల పాలనను కొనసాగించడం కోసం మోహరించారు. ఈ పరిస్థితులపై సినిమా తీయాలని భావిస్తోంది. Jr NTR తన చివరి చిత్రం ‘RRR’లో తన అద్భుతమైన నటనకు ప్రశంసలను అందుకుంటున్నాడు. అధికార పార్టీ అతన్ని కోరడంలో ఆశ్చర్యం లేదు. అంతేకాకుండా, తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మరింత ప్రభావం చూపాలనుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహ రచన చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అందుకు బాగా హెల్ప్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోలేదట. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ రాయనున్నారు.