War 2: వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన తారక్.. షూటింగ్ లో పాల్గొనేది అప్పుడే!

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 11:13 AM IST

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం వార్ 2 లో కూడా నటించనున్నారు ఎన్టీఆర్ం. ఇకపోతే తారక్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2. SRF స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం.. పక్క ప్లానింగ్ తో ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సీన్స్ తెరకెక్కించడం కోసం కూడా పక్క ప్రణాళికని సిద్ధం చేశారట. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ 60 రోజుల డేట్స్ ని ఇచ్చారట.వీటిలో 30 రోజులు తన సోలో సీన్స్ కోసం, మరో 30 రోజులు హృతిక్‌తో కలిసి ఉన్న సీన్స్ కోసమట. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నారని సమాచారం. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటారో చూడాలి మరి. అదేవిధంగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.

తెలుగులో చివరగా ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తనకున్న ఫాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు ఎన్టీఆర్. తన డాన్స్ తో, నటనతో మాటలతో పాటలతో ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్నారు.