బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్( Saif Ali Khan)పై దాడి (Attack ) దాడి జరిగిన సంగతి తెలిసిందే. నాల్గు రోజుల క్రితం ముంబై బాంద్రాలోని తన నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి చేసాడు. దాడి అనంతరం సైఫ్ ను కుటుంబ సభ్యులు లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం బాగానే ఉంది. ఈ ఘటన పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోగా..ఇంట్లో పనిచేసే వారిని సైతం ఈ ఘటన పై ఆరా తీస్తున్నారు.
US President Vs World Leaders : అమెరికాను మించిన రేంజులో ఈ దేశాధినేతలకు శాలరీలు
సైఫ్ ఇంట్లో పిల్లలను ఆడించే ఆయా ఎలియామా ఫిలిప్ (56) నుంచి కూడా పోలీసులు స్టేట్ మెంట్ తీసుకున్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆమె పూసగుచ్చినట్టు తెలిపింది. “ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని మొదటగా చూసింది నేనే. అర్ధరాత్రి తర్వాత బాత్రూం వద్ద అలికిడి అయితే, కరీనా కపూర్ ఏమో అనుకున్నాను. దాంతో మళ్లీ నిద్రపోయాను. కొంచెం సేపటి తర్వాత మళ్లీ శబ్దం వచ్చింది. ఏదో జరుగుతోందని అనుమానం వచ్చింది. అప్పుడు సమయం 2 గంటలు అనుకుంటా. బాత్రూం నుంచి ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. అతడు సైఫ్ కుమారుడు జెహ్ ఉన్న గదిలోకి వెళ్లడం చూశాను. దాంతో నేను కూడా పరుగుపరుగున ఆ గదిలోకి వెళ్లాను.
నన్ను చూసిన ఆ వ్యక్తి… నోటిపై వేలు ఉంచుకుని “అరవొద్దు… ఎవరూ బయటికి వెళ్లొద్దు” అని హిందీలో చెప్పాడు. అతడి చేతిలో ఓ కర్ర, కత్తి వంటి ఆయుధం కనిపించింది. అయినప్పటికీ నేను ముందుకు అడుగేసి చిన్నారి జెహ్ ను చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నించాను. అతడు నాపై దాడికి దిగాడు. నేను చేతులు అడ్డుపెట్టడంతో నా రెండు చేతులకు గాయాలయ్యాయి. దాంతో… నీకేం కావాలి? అని అతడ్ని ప్రశ్నించాను. నాకు కోటి రూపాయలు కావాలి అని అతడు ఇంగ్లీషులో బదులిచ్చాడు. ఇంతలో నా కేకలు విని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఆ గదిలోకి వచ్చారు. ఎవరు నువ్వు, ఏం కావాలి అంటూ సైఫ్ ఆ వ్యక్తిని ప్రశ్నించారు. దాంతో ఆ వ్యక్తి… సైఫ్ పై కర్రతో, కత్తితో దాడి చేశాడు. సైఫ్ సార్… ఎలాగో అతడి నుంచి తప్పించుకుని ఆ గది బయటికి పరుగెత్తి ఆ గది తలుపులు వేసేశారు. ఆ తర్వాత మేం అందరం ఆ ఇంటి పై ఫ్లోర్ లోకి పరుగెత్తాం. కాసేపటికి ఆ వ్యక్తి పారిపోయాడు” ఇది జరిగిందంటూ ఆయా పోలీసులకు తెలిపింది.