Jayasudha Marriage: జయసుధ మూడో వివాహంపై రూమర్స్.. చక్కర్లు కొడుతున్న ఫొటో!

ప్రముఖ నటి జయసుధ (Jayasudha) మరోసారి పెళ్లి చేసుకొన్న విషయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Published By: HashtagU Telugu Desk
Jayasudha

Jayasudha

ప్రముఖ నటి జయసుధ (Jayasudha) మరోసారి పెళ్లి చేసుకొన్న విషయం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఏడాది క్రితం జయసుధ (Jayasudha) భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకొని మరణించడం ఆమె జీవితంలో విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఇష్టంగా ప్రేమించి పెళ్లి (Marriage) చేసుకొన్న భర్త ఆకస్మాత్తుగా ఈ లోకం విడిచి వెళ్లడంతో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యారని ఆమె సన్నిహితులు చెప్పుకొంటారు. అయితే ఇటీవల అమెరికాకు చెందిన ఓ వ్యక్తిని మూడో వివాహం చేసుకొన్న విషయంపై మీడియాలో గుసగసలు వినిపించాయి.

కానీ ఇటీవల జరిగిన వారసుడు ప్రెస్ మీట్‌కు జయసుధ (Jayasudha) మూడో భర్తతో కలిసి రావడం మీడియా కంటికి చిక్కింది. జయసుధ కొంతకాలం ఫారిన్ కంట్రీలో ఉన్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో వ్యక్తితో రిలేషన్ లో ఉన్నట్టు సోషల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సీనియర్ నటి జయసుధ స్పందిస్తేకానీ.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

Also Read: Hug Day Special: ప్రేమికులకు షాక్.. ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే!

  Last Updated: 10 Feb 2023, 12:42 PM IST