Shah Rukh Khan: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.1,150 కోట్లు కలెక్ట్ చేసి బాలీవుడ్ చరిత్రలోనే రికార్డును నెలకొల్పింది. జవాన్ సినిమాను థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ నవంబర్ 2వ తేదీ నుంచి ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. అయితే.. థియేటర్లలో చూసినవారు కూడా మళ్లీ చూడాలి.
ఎందుకంటే కత్తెర పడిన చాలా సీన్స్‌ను ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో ఇదే టాక్ నడుస్తోంది. ఓటీటీలో జవాన్ లెంగ్త్ 3 గంటల పైనే ఉంటుందని అంటున్నారు. అయితే.. థియేటర్లో మాత్రం ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉండింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేశారు.
షారుఖ్‌ఖాన్ తాజాగా నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘డంకీ’ (DUNKI) విడుదలకు సిద్ధమవుతోంది. అయితే మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్, లాగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, పీకే (బ్లాక్ బస్టర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తాప్సీ కథనాయికగా నటిస్తుంది. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదల కానుండగా.. మూవీ నుంచి ఇప్పటివరకు ఒక్క అప్‌డేట్ రాకపోవడం విశేషం. ఒకవేళ ఈ మూవీ కూడా హిట్ అయితే.. షారుక్ కు వరుసగా హ్యాట్రిక్ హిట్ దక్కినట్టు అవుతుంది.
Also Read: CM KCR: ప్రభాకర్ రెడ్డిపై దాడిని ఖండించిన కేసీఆర్, ఘటనపై ఫోన్ లో ఆరా!