Site icon HashtagU Telugu

Jathi Ratnalu director: జాతిరత్నాలు డైరెక్టర్‌కి అరుదైన వ్యాధి..!

Cropped

Cropped

జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కామెడీ సినిమాలు చేసే అతడు బయట చాలా సీరియస్‌గా కనిపిస్తుంటాడు. అందుకు అతడికున్న హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే వ్యాధే కారణమని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. “నాకు గ్లూటెన్‌ పడదు. కాఫీ తాగితే 2 రోజులు నిద్ర పట్టదు. ఏదైనా జ్యూస్ తాగితే నా మైండ్‌ కామ్‌ అవుతుంది” అని తెలిపాడు.

అంతేకాకుండా ఈ వ్యాధి ఉన్నవారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయని, ఎక్కువ లైటింగ్ చూసినా.. ఘాటైన వాసనలు పీల్చిన తాను తట్టుకోలేన‌ని అనుదీప్ పేర్కొన్నాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుదీప్ ఈ అరుదైన‌ వ్యాధి ఉందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడుగా కెరీర్ ను ప్రారంభించిన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. జాతిరత్నాలు సినిమాతో అనుదీప్ పేరు టాలీవుడ్ లో మోతమోగింది. ఈ సినిమా తర్వాత అనుదీప్ ఇటీవల తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే మూవీని తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

Exit mobile version