Jani Master Mother: ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి (Jani Master Mother) బీబీ జాన్ గుండెపోటుకు గురయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో గత కొన్ని రోజులుగా ఆమె బెంగతో ఉన్నారు. శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి ఆయేషా ఆసుపత్రికి వెళ్లి బీబీజాన్‌ను పరామర్శించారు. అయితే ఇటీవల లేడీ కొరియోగ్రాఫర్ విషయంలో ఆరోపణ ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ప్రస్తుతం కోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌కి తన తల్లికి గుండెపోటు అనేది మరో జీర్ణించుకోలేని విషయం. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను జనసేన పార్టీ ఇప్పటికే సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవని జానీ మాస్టర్ తరపున న్యాయవాది వాదిస్తున్నారు. అంతేకాకుండా జానీ మాస్టర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ కుట్ర జరుగుతుందని ఆయన భార్య ఆయేషా సైతం ఆరోపించిన విషయం తెలిసిందే.
Also Read: Most Sixes In Cricket: రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఎన్ని సిక్సర్లు కొట్టాడో తెలుసా..?
మరోవైపు ఈనెల్లో నేషనల్ అవార్డు కోసం జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ తీసుకున్నారు. అయితే బెయిల్ తీసుకున్న మరుసటి రోజే జానీ మాస్టర్‌కు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేస్తున్న సంబంధిత కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. లైగింక వేధింపుల ఎదుర్కొంటున్న వ్యక్తులకు నేషనల్ అవార్డు ఇవ్వకూడదనే నియమం ఉన్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు. మరోవైపు నేషనల్ అవార్డు రద్దు చేయడంపై టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే జానీ మాస్టర్ బెయిల్ తీర్పు ఈనెల 14న జరగనుంది. ఇకపోతే జానీ మాస్టర్ స్వస్థలం ఏపీలో నెల్లూరు జిల్లా. ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఆయన జనసేన పార్టీ తరపున విస్తృతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.