Site icon HashtagU Telugu

Jani Master : జైలు నుండి వచ్చాక ఫస్ట్ టైం సినిమా ఫంక్షన్లో మాట్లాడిన జానీ మాస్టర్..

Jani Speech

Jani Speech

మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో అరెస్ట్ అయ్యి..బెయిల్ ఫై బయటకు వచ్చిన జానీ మాస్టర్ (Jani Master)..ఫస్ట్ టైం KCR సినిమా ఫంక్షన్లో సందడి చేసారు. మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే కేసులో ఆయనను నార్సింగి పోలీసులు ఈ ఏడాది సెప్టెంబర్ 19న గోవాలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్ట్ అతడి రిమాండ్ కు తరలించగా..దాదాపు 36 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ ఫై విడుదలయ్యారు. ఈ కేసు కారణంగా ఆయనకు నేషనల్ అవార్డు మిస్ అయ్యింది. ఇక జానీ జైల్లో ఉన్నప్పుడు ఆయనకు చాలామందే మద్దతు పలుకగా..పలు ఛాన్సులు మాత్రం మిస్ అయ్యాయి.

తాజాగా ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింక్ రాకేష్ (Rocking Rakesh) హీరోగా తెరకెక్కిన ‘KCR’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (KCR Pre Release Event) నిన్న రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీం తో పాటు జానీ మాస్టర్ కూడా అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… తన విషయంలో రీసెంట్ గా జరిగిన పలు పరిణామాల గురించి స్పందించారు. “గత కొద్ది రోజులుగా నా జీవితంలో కొన్ని మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. నన్ను నమ్మిన ప్రతీ ఒక్కరికీ… తనను ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన వారందరికీ థ్యాంక్స్. మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు. త్వరలోనే అన్నీ తెలుస్తాయి” అన్నారు. భర్తకు ఎల్లవేళలా తోడుగా ఉండేది భార్య మాత్రమే అన్నారు. “ఒక భర్త వెనుకాల భార్య ఉంటుంది. ఆమె ఒక పవర్. ఎందుకు చెప్తున్నాను అంటే… ఈ మధ్య నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. ఆ సమయంలో నా భార్య నాకు ఎంతో అండగా నిలిచింది. ఒక వెన్నుముకలా నిలిచి అన్నీ చూసుకుంది. భార్యలు వెనుక ఉండి భర్తలను సరైన దారిలో నడిపిస్తున్నారు. తల్లిగా, ఫ్రెండ్ గా ఉండి మంచి మార్గంలో తీసుకువెళ్తున్నారు. వారి వల్లే భర్తలు మంచి విజయాలను సాధిస్తున్నారు. అలాగే, రాకేష్ వెనుక సుజాత ఉంది” అని జానీ చెప్పుకొచ్చారు.

ఇక KCR మూవీ కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుందన్నారు. “రాకేష్ చాలా మంచి వ్యక్తి. ‘జబర్దస్త్’కు వచ్చినప్పుడు నుంచి తనతో పరిచయం ఉంది. ఎప్పుడూ ఒకరి గురించి నెగెటివ్ చెప్పడు. సెల్ఫిష్ గా ఉండాలనుకోడు. పదిమంది సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనుకుంటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్. ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి వచ్చినవారందరికి థాంక్స్. ఇక్కడకు వచ్చినవారందరూ అలా కష్టపడినవారే. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని తెలిపాడు.

Read Also : Fine Rice : జనవరిలో తెలంగాణ సర్కార్ సన్నబియ్యం పంపిణి చేయడం కష్టమే..!!