Janhvi Kapoor: హ్యాపీగా.. జాలీగా.. జాన్వీ!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

Published By: HashtagU Telugu Desk
Janhvy

Janhvy

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ బ్యూటీకి సంబంధించిన జిమ్, స్విమ్మింగ్, డాన్సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. పలు సినిమాలతో బిజీబిజీగా జాన్వీ సరదాగా గడిపేందుకు ఫ్రాన్స్ టూరుకెళ్లింది. ఆ కంట్రిలో ఎంజాయ్ చేస్తున్న ఫొటో ఒకటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. “వివ్ లా ఫ్రాన్స్.” అంటూ రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం జాన్వీ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జాన్వీ దివంగత నటి శ్రీదేవి, సినీ నిర్మాత బోనీ కపూర్ కుమార్తెలు. జాన్వీ కపూర్ షూటింగ్‌లతో బిజీగా లేనప్పుడు, ఇష్టమైన ప్రదేశాలను తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫొటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ బ్యూటీ. బికినీ, ఆఫ్ శారీస్, డిఫరెంట్స్ టాప్స్ ధరిస్తూ అందాలను అరబోస్తోంది. అందుకే ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

 

  Last Updated: 04 Jun 2022, 04:11 PM IST