Suriya : సూర్య ‘కర్ణ’ మూవీకి రంగం సిద్ధం.. రెండు భాగాలుగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌..

సూర్య 'కర్ణ' మూవీకి రంగం సిద్ధం అయ్యిందట. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌..

Published By: HashtagU Telugu Desk
Janhvi Kapoor Is Heroine For Suriya Rakeysh Omprakash Mehra Karna Movie

Janhvi Kapoor Is Heroine For Suriya Rakeysh Omprakash Mehra Karna Movie

Suriya : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో.. ‘కర్ణ’ అనే పిరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ చేయబోతున్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మహాభారత కథలోని కర్ణుడి పాత్ర ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్న ప్రకాశ్ మెహ్రా.. కర్ణ రోల్ కోసం సూర్యని ఎంచుకున్నారు. ఇన్నాళ్లు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్దమవుతుందట.

ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నారట. ఇక ఈ భారీ పిరియాడికల్ మూవీని కూడా రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారట. మూవీలో ఎక్కువ భాగం యుద్ధ సన్నివేశాలే ఉండబోతున్నాయట. దీంతో చిత్ర యూనిట్ వాటి ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటినుంచే పని చేస్తుందట. ఈక్రమంలోనే ఆర్ఆర్ఆర్ మూవీకి వర్క్ చేసిన హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ తో యుద్ధ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నారట.

దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నారట. ఈ మూవీలో కోలీవుడ్ టు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కనిపించబోతున్నారు. కాగా సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం కూడా సెమి పిరియాడికల్ యాక్షన్ డ్రామాగానే రూపొందుతుంది. సైఫై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం టైం ట్రావెల్ నేపథ్యంతో.. 1700 నుంచి 2023 వరకు ఉన్న మధ్య కాలంతో ఈ సినిమా కథ సాగనుంది. తమిళ దర్శకుడు శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కాబోతుంది.

Also read : Devara : ఎన్టీఆర్ బర్త్ డేకి ‘దేవర’ నుంచి సాంగ్ రావడం కష్టం.. పాటకి బదులుగా..

  Last Updated: 15 May 2024, 12:42 PM IST