Site icon HashtagU Telugu

Janhvi Kapoor Tirumala : ప్రియుడి తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

Janvi Tirumala

Janvi Tirumala

దివంగత నటి శ్రీదేవి (Sridevi) 61 వ పుట్టిన రోజు సందర్బంగా ఆమె కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor)..తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకుంది. ప్రతి ఏడాది తల్లి పుట్టిన రోజు నాడు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం జాన్వీ కి అలవాటు. ఈ క్రమంలో ఈరోజు కూడా అలాగే దర్శించుకుంది. కాకపోతే ఆమె ఒక్కతే కాకుండా తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలిసి తిరుమలకు కాలినడకన వెళ్లి వెంకన్నను దర్శించుకుంది. తిరుమలలో జాన్వీ కపూర్, శిఖర్ పహార్ దర్శనం చేసుకొని గుడి నుంచి బయటకు వచ్చిన వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. నిత్యం హాట్ హాట్ గా కనిపించే జాన్వీ..తిరుమల దర్శనం నేపథ్యంలో పద్దతిగా చీర కట్టుకోగా శిఖర్ పహారియా పంచె, కండువా తో కనిపించి ఆకట్టుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

జాన్వీ కపూర్ తన తల్లితో దిగిన చిన్నప్పటి ఫోటోతో పాటు, తిరుమల కాలినడక మెట్లను, తిరుమలలో తాను దిగిన ఫోటోని షేర్ చేసి హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే…ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర మూవీ చేస్తుంది. తెలుగు లో ఈమెకు ఇదే ఫస్ట్ సినిమా కావడం విశేషం. తాజాగా విడుదలైన చుట్టమల్లే సాంగ్ ఓ రేంజ్ లో ఆకట్టుకోవడమే కాదు ఒక్కసారిగా సినిమా పై అంచనాలు పెంచేసింది. ముఖ్యముగా ఈ సాంగ్ లో జాన్వీ ..ఘటన అందాలతో రెచ్చిపోయింది. ఈ సాంగ్ చూస్తున్నంత సేపు..నందమూరి అభిమానులు సీనియర్ ఎన్టీఆర్ , శ్రీదేవి లను గుర్తు చేసుకున్నారు.

Read Also : Hanuman: పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. సమస్యలన్నీ మటుమాయం!