Site icon HashtagU Telugu

Pawan Kalyan : పిఠాపురం కొత్త ఇంటిలో.. పవన్ ఉగాది సెలబ్రేషన్స్ చూశారా..!

Pawan Kalyan Janasena

Pawan Kalyan Janasena

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఏపీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఉండేదుకు ఒక ఇంటిని, ఆఫీస్ ని రెడీ చేయించుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలులో మూడు అంతస్థుల భవనాన్ని పవన్ కోసం జనసైనికులు దగ్గరుండి సిద్ధం చేసారు. ఇక నేడు ‘ఉగాది’ పర్వదినం కావడంతో.. పిఠాపురం కొత్త ఇంటిలో పవన్ కళ్యాణ్ పండుగని జరుపుకున్నారు.

పూజాకార్యక్రమాలతో గృహప్రవేశం చేసి కొత్త ఇంటిలో ఉగాది పండుగని జరుపుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని జనసేన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ కార్యక్రమం తరువాత జరిగిన ఉగాది ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. పవన్ తో పాటు ఆయన సోదరుడు నాగబాబు, తెదేపా నేత వర్మ, అలాగే జనసేన నేతలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక అక్కడ నిర్వహించిన ఉగాది పూజల్లో పవన్ వేదపండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ప్రజలకు మేలు జరగాలని, అలాగే రైతులకు, మహిళలకు, యువకులకు మరింత ప్రోత్సాహం అందాలని.. తాను ఆకాక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నట్లు, పిఠాపురం నుంచి విజయకేతనం ఎగురవేయబోతున్నట్లు పేర్కొన్నారు.

కాగా ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ నుంచి గట్టి సపోర్ట్ ఉండబోతుంది. మెగాస్టార్ చిరంజీవి నిన్న తమ్ముడిని పిలిపించుకొని.. జనసేన ఎన్నికల ఖర్చు కోసం ఐదు కోట్ల విరాళం ఇచ్చారు. అంతేకాదు రామ్ చరణ్ కూడా ఈ ఎన్నికల్లో పవన్ కి ఆర్ధికంగా తోడు ఉంటానని మాట ఇచ్చారట. మరి ఈ మెగా సపోర్ట్ తో పవన్ ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి.

Also read : Pushpa 2 : నైజంలో పుష్ప 2 థియేటర్ రైట్స్ తగ్గేదేలే.. 100 కోట్లు దాటేసింది..