- విజయ్ నటించిన జన నాయకన్ చిత్రం నుంచి బిగ్ అప్డేట్
- డిసెంబర్ 18న రెండో పాటను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్
Jana Nayagan: దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో విడుదల కానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని మొదటి పాట ‘దళపతి కచేరీ’కి ప్రేక్షకులనుండి విశేష స్పందన లభించింది.
రెండో సింగిల్ అప్‌డేట్
అభిమానులందరూ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర బృందం రెండో పాట (సెకండ్ సింగిల్) అప్‌డేట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పాట డిసెంబర్ 18న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఉన్న ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read: ఒమన్ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ కరెన్సీ విశేషాలీవే!
Calm till yesterday..
Storm from the 18th🔥#JanaNayaganSecondSingle is releasing on Dec 18th 🧨#JanaNayagan#JanaNayaganPongal#JanaNayaganFromJan9#Thalapathy @actorvijay sir @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss… pic.twitter.com/aHPnTb6IOg— KVN Productions (@KvnProductions) December 16, 2025
చిత్ర విశేషాలు
ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నరైన్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
విజయ్ రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇందులో సామాజిక, రాజకీయ సందేశం బలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
