Site icon HashtagU Telugu

Jahnavi Swaroop : సినిమాల్లోకి మహేశ్ బాబు మేనకోడలు!

Jahnavi Swaroop

Jahnavi Swaroop

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మరో వారసురాలు సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనకోడలు, మంజుల-సుధీర్ బాబుల కుమార్తె జాన్వీ స్వరూప్ తాజాగా టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతుండటంతో, అభిమానుల్లో ఆమె డెబ్యూ పట్ల ఆసక్తి మరింత పెరిగింది. కృష్ణ గారి కుటుంబం నుండి ఇప్పటికే మహేశ్, విజయనిర్మల, మంజుల వంటి వారు సినీ పరిశ్రమలో గొప్ప పేరు సంపాదించడంతో జాన్వీ ఎంట్రీపై కూడా అందరి దృష్టి పడింది.

Montha Cyclone Effect : చిరుగుటాకులా వణుకుతున్న ఏపీ

చిన్నప్పుడే ఆమె సినిమాలకు పరిచయమయ్యారు. ‘మనసుకు నచ్చింది’ సినిమాలో జాన్వీ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి, తన నటనతో అప్పట్లోనే గుర్తింపు పొందారు. కాలక్రమేణా సినిమాలంటే ఇష్టం పెరిగి, హీరోయిన్‌గా నిలబడాలన్న లక్ష్యంతో ఆమె పలు రంగాల్లో మెళకువలు నేర్చుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా నటనలో వైవిధ్యం, భావ వ్యక్తీకరణలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు, డాన్స్‌లో కూడా నిత్యం కష్టపడి శిక్షణ పొందుతున్నట్లు ఫిలిం సోర్సెస్ చెబుతున్నాయి.

ఇక ఈ ఎంట్రీ కోసం ఆమె పూర్తిగా సిద్ధమైపోతోంది. ఫిట్నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, శరీర సౌష్టవాన్ని కాపాడుకునేలా కఠిన వ్యాయామాలు కొనసాగిస్తోంది. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, స్విమ్మింగ్ వంటి అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ, మోడలింగ్ ఫీల్డ్లో కూడా అనుభవాన్ని సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె డెబ్యూ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కృష్ణ కుటుంబం వారసురాలిగా జాన్వీ స్వరూప్ ఎలాంటి ప్రత్యేకతను చూపిస్తారో చూడాలి. అభిమానులు మాత్రం ఆమె ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version