ఫ్యామిలీ హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న జగపతి బాబు (Jagapathi Babu)..ప్రస్తుతం క్యారెక్టర్ అరెస్ట్ గా..విలన్ ఇలా ఏ ఛాన్స్ వచ్చిన దానికి ఒకే చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకొని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. అభిమానులు అంటే ప్రేమను పంచేవాళ్లని మనస్ఫూర్తిగా నమ్మానని, కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే.. కొంతమంది అభిమానులు ప్రేమకంటే ఆశించడమే ఎక్కువైందన్నారు. తనను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారన్నారు. అందుకే ఇకపై తన అభిమాన సంఘాలు, ట్రస్ట్ లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, వాటిఆధ్వర్యంలో చేసే సేవా కార్యక్రమాలను విరమించుకుంటున్నట్లు తెలిపారు. అయితే తనను ప్రేమించే అభిమానులకు మాత్రం ఎప్పుడూ తోడుగానే ఉంటానని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
“అందరికి నమస్కారం. 33 ఏళ్లుగా నా కుటుంబం శ్రేయోభిలాషుల్లాగ నా అఏభిమానులు కూడా నా పెరుగుదలకు ముఖ్య కారణంగా భావించాను. అలాగే వాళ్ల ప్రతి కుటుంబ విషయాల్లో పాల్గొని వాళ్ల కష్టాల్ని నా కష్టాలుగా భావించి వాళలు నాకు తోడుగా ఉన్న నా అభిమానులకు నేను నీడగా ఉన్నాను. అభిమానులంటే అభిమానం ప్రేమ ఇచ్చేవాళ్లని మనస్పూర్తిగా నమ్మాను. కానీ బాధకరమయిన విషయం ఏంటంటే కొంతమంది అభిమానులు ప్రేమ కంటే ఆశించడం ఎక్కువ అయిపోయింది. నన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకువచ్చారు. మనసు ఒప్పుకోకపోయినా బాధతో చెప్పాల్సిన విషయం ఏంటంటే.. ఇక నుంచి నా అభిమాన సంఘాలకు, ట్రస్ట్ కు నాకు సంబంధం లేదు విరమించుకుంటున్నాను. అయితే కేవలం ప్రేమించే అభిమానులకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను.. జీవించండి.. జీవించనివ్వండి.. మీ జగపతి బాబు” అంటూ నోట్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరలవుతుంది. జగపతి ట్వీట్ చూస్తే..పెద్ద ఎత్తున అభిమానులు ఆయన్ని డబ్బు అడుగుతున్నారని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అర్ధం అవుతుంది.
Read Also : Pawan Kalyan : తిరుపతి నుండి జనసేనాని పోటీ..?
నా అభిమానులకు మనవి…. pic.twitter.com/iLN9tToL7T
— Jaggu Bhai (@IamJagguBhai) October 7, 2023