మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన యానిమేటెడ్ ఫాంటసీ క్లాసిక్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari Re Release) మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాను మే 9న 2D, 3D వెర్షన్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమాపై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని, మోడ్రన్ టెక్నాలజీ సహాయంతో నూతనంగా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.
CBN : నేను బటన్ నొక్కే టైపు కాదు – చంద్రబాబు
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ మైలురాయి చిత్రం, అప్పట్లో తెలుగు సినిమా రంగంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచింది. శ్రీదేవి గ్లామర్, చిరంజీవి నటన, ఇళయరాజా అద్భుతమైన సంగీతం సినిమాను మరింత ప్రత్యేకతను చేకూర్చాయి. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.15 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే మే 9న, 34 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
ఈసారి ప్రేక్షకులకు 2D కాకుండా 3D ఫార్మాట్‌లోనూ సినిమా చూడడానికి అవకాశం కలిగించటం ప్రత్యేక ఆకర్షణ. రీ రిలీజ్ సందర్భంగా మేకర్స్ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చిత్రాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిరంజీవి అభిమానులు మాత్రమే కాదు, సినీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. మరి ఈ కొత్త అనుభూతి ఎలా ఉంటుందో చూడాలి.