Site icon HashtagU Telugu

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు సుకేష్ చంద్రశేఖర్ ఘాటైన ప్రేమ లేఖ

Jacqueline Fernandez

Jf1sc 2023 2 16 3 13 15 Thumbnail 2023 3 8 9 28 48 Thumbnail

Jacqueline Fernandez: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోసం సుకేష్ చంద్రశేఖర్ కొత్త ప్రేమలేఖ రాశారు. ఆయన తన లాయర్ అనంత్ మాలిక్ ద్వారా ఈ లేఖను అందజేసినట్లు సమాచారం. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సుఖేష్ చంద్రశేఖర్ కేసులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఇక తాజాగా వారిద్దరి ప్రైవేట్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. 200 కోట్ల దోపిడీ కేసులో జైలులో ఉన్నాడు. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సహ నిందితురాలిగా చేర్చారు. వీటన్నింటి మధ్య సుకేష్ చంద్రశేఖర్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోసం జైలు నుండి ఒక లేఖ రాశాడు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై తనకున్న ప్రేమను సుకేష్ చంద్రశేఖర్ తెలియజేస్తున్నాడు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను చాలా మిస్ అవుతున్నానని లేఖలో పేర్కొన్నాడు. అలాగే ఆమెకు సూపర్ సర్ ప్రైజ్ బర్త్ డే ఇవ్వాలని అనుకుంటున్నట్టు పేర్కొన్నాడు. నా ప్రేయసి జాక్వెలిన్. ఏప్రిల్ 28న ఫిల్మ్‌ఫేర్ అవార్డులో చూశాను. నేను నిజం చెబుతున్నాను, మీరు అత్యద్భుతంగా ఉన్నారు. మీ పెర్ఫార్మెన్స్ బెస్ట్. మీ డ్యాన్స్ షో స్టాపర్. మీ నృత్యం చాలా అందమైనది . నేను మీతో మరోసారి ప్రేమలో పడ్డాను అంటూ తన భావాలను వ్యక్తపరిచాడు. .

నువ్వే నా రాణివి నేను నిన్ను ఎంత పిచ్చిగా కోరుకుంటున్నానో తెలుసా? నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని కూడా నాకు తెలుసు. మీరు ఇష్టపడే మీ పుట్టినరోజు కోసం నేను సూపర్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసాను అన్నాడు. గతంలో ఈస్టర్ సందర్భంగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి సుకేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. విశేషమేమిటంటే, సుకేష్ చంద్రశేఖర్ అతని భార్య ఇలీనాతో పాటు జైలులో ఉన్నారు. ఇద్దరిపై మనీలాండరింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సహ నిందితురాలిగా చేర్చింది.

Read More: Virat Kohli Row: రోజురోజుకీ మరింత ముదురుతున్న కోహ్లీ, గంభీర్ నవీన్ ల వివాదం?

Exit mobile version