టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జాక్’(JACK ). ప్రముఖ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్నారు. హ్యారీస్ జయరాజ్ అందించిన సంగీతం ఇప్పటికే ఆకట్టుకుంటుండగా, తాజా ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
Prabhas Heroine : మళ్లీ తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్
ట్రైలర్ 3 నిమిషాల 7 సెకన్ల పాటు సాగుతుంది. ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ వీడియో టెర్రరిస్ట్, డ్రగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా సినిమా రూపొందిందని స్పష్టమవుతోంది. ట్రైలర్‌లో సిద్దు స్టైలిష్ లుక్, వైష్ణవి చైతన్యతో రొమాంటిక్ సీన్లు, ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశ్ రాజ్, సిద్దు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ కానున్నాయని అర్థమవుతోంది. ఈ ట్రైలర్ యూత్‌ను బాగా ఆకర్షించేలా కట్ చేయబడింది. ముఖ్యంగా రొమాన్స్, యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ట్రైలర్‌ను బట్టి చూస్తే.. ‘జాక్’లో సిద్దు తన నటనలో కొత్తదనం చూపించబోతున్నాడు. వైష్ణవి చైతన్య, ప్రకాశ్ రాజ్ లాంటి నటులతో మంచి ఎమోషనల్ డ్రామా కూడా సినిమా హైలైట్ కానుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందా? అన్నది చూడాల్సిందే.