Site icon HashtagU Telugu

Kiraak RP : రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్దస్త్ ఆర్పీ.. మాకు గౌరవం ఇస్తేనే మీకు గౌరవమిస్తాం..

Jabardsath Kiraak Rp Sensational Comments on Roja

Jabardsath Kiraak Rp Sensational Comments on Roja

Kiraak RP : ఎన్నికల వేల సినీ, టీవీ సెలబ్రిటీలు కూడా ప్రచారంలో భాగమవుతున్నారు. రాజకీయ నాయకుల లాగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీలో ఉన్న రోజా(Roja) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కి సపోర్ట్ చేసే ఇండస్ట్రీ వాళ్ళని తిడుతుంది. కానీ తను కూడా ఇండస్ట్రీ వ్యక్తి అని మర్చిపోతుంది. ఇక తనకు సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్స్ అంతా పవన్ కి సపోర్ట్ చేస్తుండటంతో సహించలేక వాళ్లపై కూడా ఇష్టమొచ్చినట్టు తిడుతూ కామెంట్స్ చేసింది. ఇప్పటికే పలువురు రోజా కామెంట్స్ కి కౌంటర్లు ఇచ్చారు. ఇటీవల గెటప్ శ్రీను ఇండైరెక్ట్ గా రోజాకు కౌంటర్ ఇచ్చారు.

తాజాగా జబర్దస్త్(Jabardasth) నటుడు కిరాక్ ఆర్పీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రెస్ మీట్ లో కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. యువరాణి రోజా ఏమైనా గొప్ప నటినా? ఆస్కార్ అవార్డు కొట్టిందా? కనీసం గెటప్ శీను, ఆది, సుధీర్.. లాంటి వాళ్ళలాగా స్కిట్స్ అయినా చేస్తుందా? రోజా మాకు గౌరవం ఇస్తే మేము కూడా గౌరవిస్తాం. మమ్మల్ని చిన్న నటులు అని చులకనగా మాట్లాడటం కరెక్ట్ కాదు. జగన్ చేసే దుర్మార్గాలను ఆమె అడగలేదు కానీ వారానికోసారి రోజా తిరుమల పోతుంది అని అన్నాడు.

ఇక ఆర్పీది నెల్లూరు కావడంతో నెల్లూరు టిడిపి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఆర్పీ మాట్లాడటంతో.. నాకు రాజకీయ అనుభవం లేదు. కానీ నెల్లూరు వేమిరెడ్డి దంపతుల సర్వీస్ నచ్చి వారికి సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. జగన్ ఫించన్ ఇస్తే సరిపోదు.‌ ఏపీకి అభివృద్ధి కావాలి. విజయసాయి రెడ్డి, బొత్స ,అనిల్ యాదవ్.. అందరూ ఓడిపోతున్నారు. ఓటమికి కారణం‌ రౌడీ రాజకీయమే. జగన్ దగ్గరివాళ్లంతా దూరమవుతున్నారు. జగన్ ఓడిపోతున్నాడు. ఇక తిరుమల కొండపై అన్న ప్రసాదం కూడా సరిగ్గా ఉడకటం‌ లేదు, తిరుమల లడ్టు కల్తీ అయిపోయింది. టీడీపీ ప్రభుత్వం అద్బుతంగా తిరుమలను అభివృద్ది చేస్తే, జగన్ హయాంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ఎన్నికలలో కూటమికి సపోర్ట్ ఇవ్వండి అని అన్నారు.

 

Also Read : Devara : అక్టోబర్ కాదు సెప్టెంబర్‌లోనే రాబోతున్న దేవర.. నిజమేనా..?