Dhanraj : డైరెక్టర్ గా మారిన మరో జబర్దస్త్ కమెడియన్.. హీరోగా చేస్తూనే దర్శకత్వం కూడా..

సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇందులో హీరోగా తానే చేయడం విశేషం.

Published By: HashtagU Telugu Desk
Jabardasth Comedian Dhanraj turned as Director

Jabardasth Comedian Dhanraj turned as Director

జబర్దస్త్(Jabardasth) తో చాలా మంది నటులు కమెడియన్స్ గా పేరు తెచ్చుకున్నారు. జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా, హీరోలుగా కూడా బిజీ అవుతున్నారు. అయితే వీరిలోనే రైటర్స్, డైరెక్టర్స్ కూడా కూడా ఉన్నారు. ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్, వేణు దర్శకులుగా మారారు. వేణు(Venu) బలగం(Balagam) సినిమాతో మంచి హిట్ కూడా కొట్టాడు.

త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా మరో కమెడియన్ ధనరాజ్(Dhanraj) డైరెక్టర్ గా మారబోతున్నాడు. సినిమాల్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ధనరాజ్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇందులో హీరోగా తానే చేయడం విశేషం.

స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 గా ధనరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తాజాగా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగగా శివబాలాజీ క్లాప్ కొట్టారు. సోలో బతుకె సో బెటర్ డైరెక్టర్ సుబ్బు కెమెరా ఆన్ చేయగా, ఫస్ట్ షాట్ డైరెక్షన్ బలగం వేణు చేశారు. అలాగే అమిగోస్ డైరెక్టర్ రాజేంద్ర తెలుగు స్క్రిప్ట్ అందజేయగా, డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ తమిళ్ స్క్రిప్ట్ ను యూనిట్ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, మధు నందన్, ఖయుమ్, భూపాల్, పృద్వి, రాకెట్ రాఘవ.. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ నటించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో.. మోక్ష, హరీష్ ఉత్తమన్, పృద్వి, అజయ్ ఘోష్, లావణ్య రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తుండగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 9నుండి ప్రారంభం కానుంది.

Also Read : Balakrishna : వరుసగా మూడు సినిమాలు 100 కోట్లకు పైగా.. సూపర్ హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య..

  Last Updated: 25 Oct 2023, 04:03 PM IST