యూట్యూబ్ సీరీస్ లతో పాపులర్ అయిన సిరి హన్మంత్ (Siri Hanmanth) స్టార్ మాలో అగ్ని సాక్షి సీరియల్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 లో అమ్మడి హంగామా తెలిసిందే. ఆ సీజన్ లో సాటి యూట్యూబర్ ఫ్రెండ్ షణ్ముఖ్ జశ్వంత్ తో ఆమె చేసిన రచ్చ అందరికీ తెలిసిందే.
We’re now on WhatsApp : Click to Join
సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ సీజన్ 6కి వచ్చాడు. ఈ క్రేజ్ తోనే షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ లో కూడా ఒక చిన్న రోల్ దక్కించుకుంది సిరి హన్మంత్.
ఇక రీసెంట్ గా అమ్మడు జబర్దస్త్ యాంకర్ గా ప్రమోషన్ కొట్టేసింది. సౌమ్యా రావు ప్లేస్ లో సిరి వచ్చి సందడి చేస్తుంది. దాదాపు రెండు నెలలుగా సిరి తన సత్తా చాటుతుంది. సిరి హన్మంత్ కి జబర్దస్త్ నీళ్లు బాగా పడ్డాయనుకుంటా అందుకే లేటెస్ట్ ఫోటో షూట్ లో అందాలతో అదరగొట్టేస్తుంది. రెడ్ కలర్ శారీలో తన గ్లామర్ షోతో సోషల్ మీడియా ఫ్యాన్స్ ని అలరిస్తుంది సిరి హన్మంత్.
అమ్మడి ఈ ఫోటోలు చూసి సిరి హీరోయిన్ మెటీరియల్ అని అంటున్నారు. రెడ్ కలర్ శారీలో సిరి ఫోటో షూట్ చూసిన ఎవరైనా సరే అమ్మడి అందానికి ఫిదా అవ్వకుండా ఉండలేరు. సిరి ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ గా చేస్తుంది. జబర్దస్త్ తోనే అనసూయ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అదే దారిలో సిరి కూడా యాంకరింగ్ తో పాటు ఫోటో షూట్స్ తో కూడా పిచ్చెక్కించేస్తుంది.
Also Read : Raviteja : రవితేజకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన హనుమాన్.. మీ వల్ల మాకు ఇబ్బందులే అంటున్న తేజా సజ్జ..!