Isha Ambani: మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ

Met Gala 2026  మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ (Pichwai) కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రిలయన్స్ రీటెయిల్ సంస్థ ‘స్వదేశ్’కు కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా […]

Published By: HashtagU Telugu Desk
Isha Ambani for Met Gala 2026

Isha Ambani for Met Gala 2026

Met Gala 2026  మెట్ గాలా 2026 వేదికపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ తన అద్భుతమైన వస్త్రధారణతో భారతీయ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరకట్టులో ఆమె మెరిసిపోయారు. ఈ చీరపై చేత్తో చిత్రించిన ‘పిచ్వాయ్’ (Pichwai) కళాఖండాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

రిలయన్స్ రీటెయిల్ సంస్థ ‘స్వదేశ్’కు కళాకారులు స్వచ్ఛమైన బంగారు తీగలతో నేసిన అంచు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఆమె ధరించిన బ్లౌజ్ 1800 క్యారెట్ల వజ్రాలు, ఎమరాల్డ్స్, పోల్కీ నగలతో మెరిసిపోవడమే కాకుండా… అందులో నిజాం నవాబుల నాటి అరుదైన ‘సర్ పేచ్’ (Sarpech) ఆభరణాన్ని చేర్చడం ఒక చారిత్రాత్మక స్పర్శను ఇచ్చింది. ఈ ఆభరణాలన్నీ తన తల్లి నీతా అంబానీ కలెక్షన్ లోనివని ఇషా పేర్కొన్నారు.

Isha Ambani

వీటితో పాటు, సుబోధ్ గుప్తా రూపొందించిన క్రోచెట్ బ్యాగ్‌లో మామిడి పండును పట్టుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌరభ్ గుప్తా పేపర్, ఇత్తడితో రూపొందించిన ‘గజ్రా’ను తలలో అలంకరించుకోవడం ద్వారా ఆమె భారతీయ మూలాలను అద్భుతంగా ప్రతిబింబించారు.

అంతకుముందు జరిగిన ప్రీ-మెట్ గాలా పార్టీలో కూడా భారత్‌లోని 26 రకాల విభిన్న ప్రాంతీయ హస్తకళల బోర్డర్లతో రూపొందించిన డ్రెస్‌ను ధరించి ఆమె అందరినీ ఆశ్చర్యపరిచారు. గత మూడేళ్లుగా రాహుల్ మిశ్రా, అనామికా ఖన్నా వంటి భారతీయ డిజైనర్ల దుస్తులనే ధరిస్తూ, ఇషా అంబానీ అంతర్జాతీయ వేదికపై భారతీయ ఫ్యాషన్‌కు బలమైన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

  Last Updated: 05 May 2026, 12:29 PM IST