Vijay Devarakonda విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. సూపర్ హీరో గెటప్ లో ఉన్న విజయ్ దేవరకొండని చూసి ఫ్యాన్స్ అంతా ఖుషిగా ఉన్నారు. అయితే ఈ ఫోటో చూడగానే కొందరు ప్రభాస్ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడంటూ చెబుతున్నారు. కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ ఉండటం ఏంటని ఆశ్చర్యపోవచ్చు.
జస్ట్ ఏదో సూపర్ హీరోలా సూట్ వేసుకుని ఫోటో షేర్ చేసినంత మాత్రానా ప్రభాస్ (Prabhas) కల్కిలో విజయ్ ఉన్నట్టేనా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే విజయ్ మాత్రం తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎప్పుడూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంటాడు. కొందరేమో ఇది విజయ్ చేస్తున్న సినిమా సాంగ్ షూట్ లో తీసిన ఫోటో అని అంటున్నారు. ఏది ఏమైనా ఈ డ్రెస్ లో విజయ్ మాత్రం నిజంగానే సూపర్ హీరోలా ఉన్నాడు.
ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. గీతా గోవిందం (Geetha Govindam)తో హిట్ అందుకున్న పరశురాం (Parasuram) డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా తర్వాత విజయ్ గౌతం తిన్ననూరి (Gautham Tinnanuri) సినిమాతో సినిమా చేస్తున్నాడు. ఇవే కాదు రీసెంట్ గా కీడా కోలా ఈవెంట్ కి అటెండ్ అయిన విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు.
Also Read : NTR : గోవాలో దేవర.. ఎన్టీఆర్ సినిమా ఏం జరుగుతుంది..?
We’re now on WhatsApp : Click to Join