Rajamouli Mahesh Movie Title : మహేష్ కి పర్ఫెక్ట్ టైటిల్.. రాజమౌళి ప్లాన్ అంటే అలానే ఉంటుందిగా..?

గోల్డ్ అంటే బంగారం లా మెరిసిపోతుందనో లేదా బంగారం అంత కాస్ట్ లీ అనో కానీ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి జరుగుతుంది.

Published By: HashtagU Telugu Desk
Mahesh Rajamouli Budget Locked

Mahesh Rajamouli Budget Locked

Rajamouli Mahesh Movie Title రాజమౌళి మహేష్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా అది సెన్సేషన్ అవుతుంది. సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ టైం లో సినిమా టైటిల్ గురించి ఒక న్యూస్ సోషల్ మీడీఅలో వైరల్ గా మారింద్. మహేష్ అందానికి పర్ఫెక్ట్ టైటిల్ పెట్టేశాడట రాజమౌళి. ఇంతకీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ టైటిల్ ఏంటంటే గోల్డ్ అన్నమాట.

GOLD.. గోల్డ్ అంటే బంగారం లా మెరిసిపోతుందనో లేదా బంగారం అంత కాస్ట్ లీ అనో కానీ సినిమాకు అదిరిపోయే టైటిల్ పెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఒకటే హడావిడి జరుగుతుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాపై ఇంటర్నేషనల్ లెవెల్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఐతే మహేష్ తో చేయబోయే సినిమా రాజమౌళి కెరీర్ లో బెస్ట్ మూవీ గా నిలుస్తుందని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.

సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో అడ్వెంచర్స్ మూవీగా వస్తుండగా సినిమా కోసం మహేష్ ఇప్పటికే డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు. మహేష్ 28 సినిమాల్లో ఎప్పుడు ఇంత వైల్డ్ లుక్ ట్రై చేయలేదు. కానీ రాజమౌళి (Rajamouli) సినిమా కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో ఉండాల్సిందే. ఈ క్రమంలో మహేష్ లుక్కు తోనే సినిమా రేంజ్ తెలియచేయబోతున్నారని తెలుస్తుంది.

రాజమౌళితో మహేష్ చేసే సినిమాను కె ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా నిర్ణ్యీంచలేదు. ఈ సినిమాకు టైటిల్ గోల్డ్ అన్నది ఫైనల్ అయితే ఈ గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ (International Market) ని కూడా షేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు సంబందించిన అప్డేట్ ని మహేష్ బర్త్ డే రోజు అనగా ఆగష్టు 9న ప్రకటిస్తారని తెలుస్తుంది. మరి అదే రోజు టైటిల్ అనౌన్స్ చేస్తారేమో చూడాలి.

Also Read : Akash Puri : ఆకాష్ పూరి అందుకే పేరు మార్చుకున్నాడా..?

  Last Updated: 25 Jul 2024, 04:41 PM IST