Janhvi Kapoor: జాన్వీ కపూర్ అప్పుడే పెళ్లికి సిద్ధమవుతోందా?

జాన్వీ కపూర్ ప్రస్తుతం పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో ఒకరు.

Published By: HashtagU Telugu Desk
Janhvi

Janhvi

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం పరిశ్రమలోని ప్రముఖ నటీమణులలో ఒకరు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. స్వర్గీయ శ్రీదేవి కుమార్తె అయితే జాన్వీ తెలుగులో ఎన్టీఆర్‌తో కలిసి “దేవర”లో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.  అయితే ఆమె తన ప్రియుడు శిఖర్ పహారియాతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు  రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరు కలిసి పలు ఆలయాలను సందర్శించి పూజలు చేయడంతో పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్స్ వినిపించాయి.

డిసెంబర్ 5, 2023 న వారు ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ కలిసి ప్రార్థనలు చేసి, పూజలో జంటగా పాల్గొన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకునే యోచనలో ఆలోచనలో ఉన్నారని ఊహాగానాలు వచ్చాయి. జాన్వీ కపూర్ “దేవర”తో సహా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ప్రస్తుతం జాన్వీ సినిమాల పరంగా నిరూపించుకోవాల్సి ఉంది. ఇప్పుడే పెళ్లి చేసుకోకపోవడం చాలా ఉత్తమం అని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.

Also Read: Rashmika Mandanna: సోషల్ మీడియాలో రష్మిక క్రేజ్.. ఇన్ స్టా ఫాలోయింగ్ లో సరికొత్త రికార్డ్

  Last Updated: 06 Dec 2023, 12:42 PM IST