హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఆ సినిమా సీక్వెల్ గా ప్లాన్ చేసిన జై హనుమాన్ విషయంలో భారీ ప్లానింగ్ తో ఉన్నారు. సినిమాలో నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న కాస్టింగ్ తో జై హనుమాన్ ని తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జై హనుమాన్ లో ఎవరెవరు నటిస్తారా అన్న ఎగ్జైట్ మెంట్ మొదలైంది. జై హనుమాన్ సినిమాలో ముఖ్యంగా హనుమాన్ రోల్ ఎవరు చేస్తారా అని నేషనల్ లెవెల్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.
ఐతే నిన్న మొన్నటిదాకా ఈ పాత్రకు మెగాస్టారు చిరంజీవి ఓకే చెప్పారని టాక్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ సినిమా గురించి మరో న్యూస్ వైరల్ గా మారింది. జై హనుమాన్ సినిమా లో హనుమంతుడిగా కోలీవుడ్ స్టార్ అజిత్ (Kollywood Star Ajith) నటిస్తారని అంటున్నారు. తమిళంలో స్టార్ హీరోగా తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తున్న అజిత్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.
ఎక్కువగా హాలీవుడ్ స్టైల్ మేకింగ్ లో కోలీవుడ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలని అనుకుంటాడు. ఐతే అలాంటి అజిత్ ని జై హనుమాన్ సినిమాలో అస్సలు ఊహించలేరు. కానీ ప్రశాంత్ వర్మ ఆ ప్రయోగం చేస్తాడని అంటున్నారు. అజిత్ ని హనుమాన్ గా నటింప చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అదే జరిగితే మాత్రం సినిమా రేంజ్ మరోలా ఉంటుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం అజిత్ కోలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. నిజంగనఏ జై హనుమాన్ లో అజిత్ ఉండటం కన్ ఫర్మ్ అయితే మాత్రం కచ్చితంగా ఆ అప్డేట్ ఫ్యాన్స్ కి ఎగ్జైట్ మెంట్ అందిస్తుందని చెప్పొచ్చు. అజిత్ తో పాటు జై హనుమాన్ లో నటిస్తారంటూ మరికొందరి పేర్లు చర్చల్లో ఉన్నాయి. మరి వీటిపై క్లారిటీ రావాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంటుంది.
Also Read : Prabhas : రాజా సాబ్ నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రెడీ..!