Rukhmini Vasanth : రుక్మిణి టీచర్ అవ్వాలనుకుందా.. అలా జరగనందుకు హ్యాపీ అంటున్న ఆడియన్స్..!

Rukhmini Vasanth ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిన హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ సినిమా సప్త సాగరాలు దాటి సౌత్ అన్ని భాషల్లో

Published By: HashtagU Telugu Desk
Is Rukhmini Vasanth Wants To Became A Teacher

Is Rukhmini Vasanth Wants To Became A Teacher

Rukhmini Vasanth ఈమధ్య కాలంలో యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిన హీరోయిన్ రుక్మిణి వసంత్. కన్నడ సినిమా సప్త సాగరాలు దాటి సౌత్ అన్ని భాషల్లో రిలీజై సక్సెస్ అయ్యింది. ఆ సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణి కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. ఆ సినిమా సక్సెస్ లో కథ కథనాలతో పాటుగా రుక్మిణి కూడా ఒక కారణమని చెప్పొచ్చు. పక్కింటి అమ్మాయిగా న్యాచురల్ యాక్టింగ్ తో రుక్మిణి అదరగొట్టేసింది. సప్త సాగరాలు దాటి తో సూపర్ పాపులర్ అయిన అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయి.

తెలుగులో ఇంకా ఖాతా తెరవలేదు కానీ తమిళంలో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తుంది రుక్మిణి. ఆ సినిమాతో కోలీవుడ్ లో తన ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తుంది అమ్మడు. ఐతే అమ్మడి తెలుగు ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వచ్చాయి కానీ ఏది నిజం కాలేదు.

ఇక తన కెరీర్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రుక్మిణి సౌత్ ఆడియన్స్ తనని ఆదరిస్తున్న తీరుకి తను చాలా సంతోషంగా ఉన్నానని అంటుంది. ఐతే తను ఒకవేళ నటిని కాకపోతే కచ్చితంగా టీచర్ అయ్యే దాన్ని తనకు చదువు చెప్పడం అంటే చాలా ఇష్టమని అంటుంది రుక్మిణి. మామూలుగా డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాడని అంటారు. కానీ టీచర్ అవ్వాలని అనుకుని హీరోయిన్ అయిన తొలి హీరోయిన్ రుక్మిణినే కావొచ్చు. ఏది ఏమైనా రుక్మిణి సినిమాల్లోకి రాకపోతే చాలా పెద్ద నష్టం జరిగేదని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.

Also Read : Niveda Pethuraj : విశ్వక్ తో నటించనని చెప్పిన హీరోయిన్.. మాస్ కా దాస్ కి బిగ్ షాక్..!

  Last Updated: 28 Jun 2024, 10:56 AM IST