Rashmika Skin Disease: రష్మికకు స్కిన్ డిసీజ్.. ఏం జరిగింది?

రష్మిక (Rashmika) తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతోందని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

Published By: HashtagU Telugu Desk
Rashmika And Samantha

Rashmika And Samantha

అందం, ఆరోగ్యంలో విషయంలో ముందుండే హీరోయిన్స్ (Heroines) అనారోగ్యాల బారిన పడుతున్నారా? స్టార్ సెలబ్రిటీలు సైతం వ్యాధులతో  (Disease) సఫర్ అవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే సమంత (Samantha)కు మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూమ్ డిజార్డర్ వ్యాధి సోకిన సంగతి తెలిసిందే. సూర్యరశ్మికి గురికావడం.. రసాయన ప్రేరేపిత సౌందర్య సాధనాలు.. తగినంత ఆహారం తీసుకోకపోవడం వల్ల రోగనిరోధక శక్తి లేకపోవడం వల్ల ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు ఆ జాబితాలో అగ్ర నటి రష్మిక (Rashmika) కూడా చేరిపోయింది. తాజాగా ఈ బ్యూటీ డెర్మటాలజిస్ట్‌ ను కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రష్మిక (Rashmika) తీవ్రమైన చర్మ వ్యాధితో బాధపడుతోందని సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయినప్పటికీ, చాలా మంది మొటిమలు లేదా విటమిన్ లోపం వంటి సాధారణ సమస్యల కోసం వైద్యులను సందర్శిస్తారు కాబట్టి చర్మవ్యాధి నిపుణుడిని అపాయింట్‌మెంట్‌ కోరడంలో తప్పు లేదని వాదిస్తున్నారు. నేషనల్ బ్యూటీ రష్మిక (Rashmika) ఓపెన్ అయితేనే అసలు విషయం ఎంటో తెలుస్తోంది.

Also Read: Janhvi Kapoor: ఆ కామెంట్స్ నన్ను తీవ్రంగా బాధించాయి: జాన్వీ కపూర్

  Last Updated: 09 Feb 2023, 03:53 PM IST