Rana Daggubati: రానా దగ్గుబాటి తండ్రి కాబోతున్నారా? మహీకా ఈ పోస్ట్ ఎందుకు చేసినట్లు..!!

  • Written By:
  • Updated On - November 22, 2022 / 10:50 AM IST

గతకొన్నాళ్లుగా రానా దగ్గుబాటి, మిహీకా బజాజ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారన్న వార్త వైరల్ గా మారింది. ఈ మధ్యే సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన ఫొటోల్లో మిహీకా బొద్దుగా కనిపించింది. దీంతో ఈ రూమర్స్ కాస్త వైరల్ అయ్యాయి. కానీ రానా దంపతుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ మధ్యే మిహీకా ఓ పాపను ఎత్తుకున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో మిహీకా తాను ప్రెగ్నెంట్ వార్తను పరోక్షంగా చెప్పిందని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గాయని కనికా కపూర్ కూడా ఈ జంటకు కాంగ్రాట్స్ చెప్పింది.

ఈ వార్తలపై హీరో రానా స్పందించారు. తాను తండ్రి కాబోతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తన భార్య గర్భవతి కాదని స్పష్టం చేశారు. దీంతో నెట్టింట్లో వస్తున్న పుకార్లు చెక్ పడినట్లయింది. అయితే మిహీకా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసింది.

భారతదేశంలో మొట్టమొదటిసారిగా మానసిక అనారోగ్యానికి బీమా వర్తిస్తుంది. మానసిక ఆరోగ్యంతో పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ ఇది గొప్ప విజయం. ఇది మరింత మంది భారతీయులను వృత్తిపరమైన సహాయం కోసం ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను అంటూ పోస్టు చేసింది.