Devara Triple Role ఎన్టీఆర్ దేవర రిలీజ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ తో పాటు సినిమాకు సంబందించిన కొన్ని విషయాల మీద కన్ ఫ్యూజన్ మొదలైంది. దేవరలో తారక్ డ్యుయల్ రోల్ అని అందరికీ తెలిసిందే. కానీ రెండు రోజుల నుంచి దేవర లో తారక్ ట్రిపుల్ రోల్ చేశాడని హడావిడి మొదలైంది. ఐతే ఈ వార్తలకు చెక్ పెట్టారు దేవర కెమెరామెన్ రత్నవేలు. దేవర సినిమాలో ఎన్ టీ ఆర్ డ్యుయల్ రోల్ మాత్రమే అని ఆయన వివరణ ఇచ్చారు. సో దాని వల్ల ఫ్యాన్స్ లో ఒక కన్ ఫ్యూజన్ క్లియర్ అయ్యింది.
అందరి చూపు క దేవర (Devara) రికార్డుల మీద ఉంది. ఫ్యాన్స్ అంతా కూడా తమ అభిమాన హీరో సినిమా ఆరేళ్ల తర్వాత సోలోగా వస్తుందని సంతోషంగా ఉన్నారు. ప్రీ రిలీజ్ బీజినెస్ తో పాటుగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎన్టీఆర్ స్టామినాను తెలియచేస్తున్నాయి. తారక్ కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి తానేంటి అన్నది ప్రూవ్ చేయబోతున్నాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్..
ఎన్టీఆర్ (NTR) దేవర సినిమా కోసం కొరటాల శివ చాలా కష్టపడ్డాడు. ఆచార్య వల్ల బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న కొరటాల శివ ఈ సినిమా కోసం తన ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించగా అనిరుద్ రవిచంద్రన్ అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చాడు.
దేవర సినిమా చివరి అరగంట అదిరిపోతుందని ఎన్టీఆర్ ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నాడు. అంతేకాదు ఫ్యాన్స్ అంతా కూడా కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది రెండు రోజుల్లో తెలుస్తుంది.
Also Read : Raviteja : రవితేజ ఆశలన్నీ అతని మీదే..!