Site icon HashtagU Telugu

Mahesh Babu: సమ్మర్ వెకేషన్ లో సూపర్ స్టార్.. “SSMB 28” కి మరో బ్రేక్!

Ssmb28

Ssmb28

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో, కుటుంబానికి, అంతకు మించి ఆరోగ్యానికి అంతే ప్రయారిటీ ఇస్తుంటారు. సాధారణంగా మహేష్ బాబు వేసవి టైమ్ లో సినిమాలకు దూరంగా ఉంటాడు. అయితే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు మేలో సెలవు తీసుకుంటాడు. అయితే, ఈ సంవత్సరం అతను తన వేసవి సెలవులను చాలా ముందుగానే తీసుకున్నాడు. అతను, అతని కుటుంబం ఈ నెల ప్రారంభంలో పారిస్‌లో 12 రోజులు గడిపారు.

గత వారాంతంలో మహేశ్ హైదరాబాద్‌ (Hyderabad) కు తిరిగి వచ్చాడు. అయితే మహేష్ బాబు ఈ వారం ప్రారంభం కావాల్సిన కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను రద్దు చేశాడు. తాజా నివేదికల ప్రకారం.. మహేష్ బాబు భగభగ మండే ఎండలకు షూటింగ్ చేయకపోవడమే మంచిదని, తాత్కాలికంగా తన షెడ్యూల్ (Shedule) ను రద్దు చేసినట్టు తెలుస్తోంది.

ఫలితంగా, “SSMB 28” షూటింగ్ ప్రస్తుతం హోల్డ్‌లో పడిపోయింది. ఇప్పటికే ఎన్నో అవంతరాలు ఎదుర్కొంటున్న ఈ మూవీ మరోసారి బ్రేక్ పడటంతో సినిమా విడుదలపై ప్రభావం చూపనుంది. మహేశ్, పరశురాం కాంబినేషన్ లో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు మహేశ్ అభిమానులు ఈ కొత్త మూవీపై గంపెడాశలు పెట్టుకున్నారు.

Also Read: Harish Rao: రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది: హరీశ్ రావు