SSMB29: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఎస్ఎస్ఎంబీ 29’ సినిమా ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్ మూవీ టైటిల్‌ను ఈ శనివారం (నవంబర్ 15) హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నారు. ఈవెంట్‌కు ముందు మేకర్స్ ఒక్కొక్కరి లుక్‌ను విడుదల చేస్తూ అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు.
ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్ సంచలనం
తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రియాంక చోప్రా ఫస్ట్-లుక్ పోస్టర్ ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌లో ప్రియాంక ‘మందాకిని’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించింది. ఆమె చీరకట్టులో ఉండి, కనిపించని శత్రువును లక్ష్యంగా చేసుకుని బుల్లెట్లు పేల్చుతున్న దృశ్యం సినిమా కథపై మరింత ఆసక్తిని పెంచింది. రాజమౌళి మార్కు హీరోయిజంతో ప్రియాంక లుక్ ఆకట్టుకుంది.
Also Read: Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్.. వెలుగులోకి మరో సంచలన విషయం!
ఆర్. మాధవన్ ఎంట్రీపై ఆసక్తి!
అయితే ఈ లుక్ పోస్టర్ల కంటే కూడా నటుడు ఆర్. మాధవన్ సోషల్ మీడియా స్పందన ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రియాంక చోప్రా పోస్టర్‌పై మాధవన్ వెంటనే స్పందించడం, ఆమె లుక్‌ను ప్రశంసించడం సాధారణ విషయమే. కానీ అంతకుముందు విడుదలైన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ పోస్టర్‌పై కూడా ఆయన అదే తరహాలో ఉత్సాహంగా కామెంట్ చేయడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఒక సినిమాలో నటిస్తున్న నటీనటులు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం సహజం. కానీ మాధవన్ ఇలా రెండు కీలక పోస్టర్లపై చురుకుగా స్పందించడంతో నెటిజన్లు ఆయన కూడా ఈ చిత్రంలో భాగమని గట్టిగా నమ్ముతున్నారు.
మహేష్ బాబు తండ్రి పాత్రలో మాధవన్?
గతంలో SSMB29 చిత్రంలో మాధవన్ ఒక కీలక పాత్ర పోషించవచ్చని, ముఖ్యంగా మహేష్ బాబుకు తండ్రి పాత్రలో నటించవచ్చని కొన్ని వార్తలు వినిపించాయి. ఇప్పుడు ప్రియాంక, పృథ్వీరాజ్ పోస్టర్ల కామెంట్స్ సెక్షన్‌లో ఆయన చురుకైన ఉనికిని చూస్తుంటే ఆయన పాత్ర ఖరారైందనే భావన మరింత బలపడుతోంది. ఈ పాన్ వరల్డ్ మూవీలో మాధవన్ లాంటి బహుముఖ నటుడు ఉంటే అది సినిమా స్థాయిని మరింత పెంచుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ సినిమాకు KL నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. మాధవన్ పాత్రపై అధికారిక ప్రకటన కోసం, అలాగే టైటిల్ లాంచ్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ శనివారం రాబోయే టైటిల్ లాంచ్‌లో దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
