Site icon HashtagU Telugu

Nandamuri Mokshagna : జాన్వి చెల్లితో వారసుడి రొమాన్స్.. ప్లాన్ అదుర్స్..!

Is Khushi Kapoor Pairing With Nandamuri Mokshagna..

Is Khushi Kapoor Pairing With Nandamuri Mokshagna..

Nandamuri Mokshagna నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడి ఎంట్రీకి టైం దగ్గర పడిందని తెలుస్తుంది. నందమూరి నట సిం హం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రానికి రంగం సిద్ధమవుతుందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మరో సినీ వారసురాలిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట. శ్రీదేవి తనయురాలు జాన్వి కపూర్ ఇప్పటికే సినిమాల్లో రాణిస్తున్నారు. మోక్షజ్ఞ కోసం జాన్వి చెల్లి ఖుషి కపూర్ ని తీసుకుంటున్నారని తెలుస్తుంది.

బోనీ కపూర్ తో బాలకృష్ణ సంప్రదింపులు జరుపుతున్నారట. అవి సక్సెస్ అయితే మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీతోనే మరో హీరోయిన్ కూడా ఎంట్రీ ఇస్తుంది. మోక్షజ్ఞ ఖుషి కపూర్ (Khushi Kapoor) ఈ జోడీని సెట్ చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ వర్మ. ఇక మోక్షజ్ఞ మొదటి సినిమా కథ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని టాక్. అన్ని అంశాలు టచ్ చేస్తూ ఫ్యాన్ ఫీస్ట్ అందించేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమాతో ఖుషి కూడా పరిచయం అయితే సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. తెలుగు తమిళ సినిమాలతోనే శ్రీదేవి స్టార్ స్టేటస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడ సత్తా చాటారు. అదే తరహాలో జాన్వి ఈమధ్యనే దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తుండగా మరో నందమూరి హీరోతో అది కూడా స్టార్ వారసుడితో ఖుషి కపూర్ తెరంగేట్రం చేస్తుందని అంటున్నారు.

ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబో సినిమాను బాలయ్య చిన్న కూతురు తేజశ్విని నిర్మిస్తుందని తెలుస్తుంది. సో ఈ సినిమా ఎంతోమందికి స్పెషల్ మూవీగా నిలుస్తుందని చెప్పొచ్చు. సినిమాను కూడా అదే రేంజ్ లో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో తెరకెక్కించే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది.

Also Read : Vikram : రాజకీయాల్లోకి తమిళ్ ఇండస్ట్రీ నుండి మరో స్టార్..?