Maharaja మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తన 50వ సినిమాగా మహారాజ తో వచ్చాడు. ఆ సినిమా థియేట్రికల్ రన్ లో 100 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా ఓటీటీ రిలీజ్ లో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. మహారాజ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరింది. సినిమా హిందీ వెర్షన్ తప్ప అన్ని సౌత్ భాషల్లో అందుబాటులో ఉంది. ఎక్కువగా మలయాళ హీరోలు చేసే తరహాలో ఈసారి విజయ్ సేతుపతి చేసి మెప్పించాడు.
సినిమా స్క్రీన్ ప్లే విషయంలో ఆడియన్స్ షాక్ అవుతారు. ఇక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మహారాజ సినిమా సౌత్ లో సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాపై బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ముందుకొస్తున్నారు. ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం మహారాజ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ (Amir Khan) కొనేశారట.
ఆయనే హీరోగా మహారాజ హిందీలో రీమేక్ అవుతుందని అంటున్నారు. సినిమా చూసిన ఆయన భారీ ధరకు హిందీ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడంతో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. విజయ్ సేతుపతి (Vijay Setupathi) నటించిన మహారాజ సినిమా హిందీలో ఆమీర్ ఖాన్ రీమేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. చివరిగా లాల్ సింగ్ చద్దా సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఆమీర్ ఖాన్ ఈ రీమేక్ తో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.
మరి ఆమీర్ ఖాన్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆమీర్ ఖాన్ చేస్తున్నాడు కాబట్టి హిందీలో మహారాజ సినిమాకు మంచి బజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
Also Read : Manchu Vishnu -Meena : మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్న మీనా.. థ్యాంక్స్ చెప్తూ స్పెషల్ పోస్ట్..