Ramayan Movie: రణ్ బీర్ కపూర్,సాయి పల్లవి రామాయణంపై మరో అప్డేట్.. అలాంటి పాత్రలో యష్?

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో రామాయణం కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. We’re now on WhatsApp. […]

Published By: HashtagU Telugu Desk
Ramayan

Ramayan

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో రామాయణం కూడా ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై తరచూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే రావణుడిగా యశ్, ఆంజనేయుడిగా సన్నీ డియోల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join
ఆ సంగతి పక్కన పెడితే రామాయణం కథను ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఎన్నోసార్లు రూపొందించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు రెడీ అయ్యారు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ. కానీ ఈసారి రాముడి కథను కొత్తగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ రాముడి పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతగా కనిపించనున్నారు. ఇక లక్ష్మణుడి పాత్రలో రవి దూబే నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సన్నీ డియోల్‌ను హనుమంతుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది.

Also Read: Anupama Parameswaran: చీరకట్టులో కుందనపు బొమ్మల మెరిసిపోతున్న అనుపమ.. ఇదే మాకు కావాల్సింది అంటూ?

అలాగే రావణుడి పాత్రలో కన్నడ హీరో యష్ కనిపించనున్నారని తెలుస్తోంది. ఇందుకోసం దాదాపు రూ. 150 కోట్లు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ రామాయణాన్ని దాదాపుగా మూడు భాగాలుగా రూపొందిస్తున్నారట. ఈ మూవీ గురించి ప్రతిరోజూ కొత్త అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తుంటాయి. ఆ మధ్య బడ్జెట్‌కు తగ్గట్టుగా సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అప్పుడు దాని షూటింగ్ షెడ్యూల్ పొడిగించారని టాక్. అయితే ఇన్ని ఊహాగానాల మధ్య ఈ సినిమా షూటింగ్ మొదలైంది.

Also Read: Vijay Deverakonda: దళపతి విజయ్ పాలిటిక్స్ పై అలాంటి కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ.?

ఏప్రిల్ 2న రామాయణం సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పుడు కేవలం బాలనటులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నారని తెలుస్తోంది. యష్, రణబీర్, సాయి పల్లవి ఇంకా షూటింగ్ సెట్‌కి వెళ్లలేదని సమాచారం. మరి ఈ విషయాలపై పూర్తి సమాచారం తెలియని అంటే మూవీ మేకర్స్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరీ. ఇందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

  Last Updated: 04 Apr 2024, 11:55 AM IST