Akhil అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఏం చేస్తాడన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అఖిల్ తో యువి క్ర్యేషన్స్ బ్యానర్ లో ధీర అనే సినిమా వస్తుందని వార్తల్లో రాగా ఇప్పటివరకు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇక మరోపక్క ఆ సినిమాను పక్కన పెట్టి అఖిల్ మరో సినిమా కథా చర్చల్లో ఉన్నాడని తెలుస్తుంది. కిరణ్ అబ్బవరం తో వినరో భాగ్యము విష్ణు కథ సినిమా తీసి సక్సెస్ అందుకున్న మురళి కిశోర్ డైరెక్షన్ లో అఖిల్ సినిమా ఉండబోతుందని టాక్.
ఈ సినిమాను నాగార్జున, నాగ చైతన్య కలిసి మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని తెలుస్తుంది. అఖిల్ తో మురళి కిశోర్ (Murali Kishore) డైరెక్ట్ చేయబోతున్న సినిమాకు టైటిల్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తుంది. అఖిల్ సినిమాకు లెనిన్ అనే టైటిల్ పెట్టాలని చూస్తున్నారట. ఈ సినిమా కథ కథనాలు చాలా కొత్తగా ఉండబోతున్నాయని తెలుస్తుంది.
Also Read : Mr Bacchan Trailer Talk : మిస్టర్ బచ్చన్ ట్రైలర్ టాక్.. మాసు క్లాసు అన్ని కలిపి కొట్టేశారు..!
ఐతే అఖిల్ ధీర కోసం లాంగ్ హెయిర్ ని పెంచుకున్నాడు. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఏమో కానీ సినిమా కోసం అఖిల్ మేకోవర్ లుక్ బాగుంది. ఇక మరోపక్క అఖిల్ నెక్స్ట్ సినిమా లెనిన్ (Lenin) వర్క్ కూడా జరుగుతుందని టాక్. ఒకేసారి రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్ తో అక్కినేని ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు అఖిల్ రెడీ అవుతున్నాడు. మరి అఖిల్ చేస్తున్న ఈ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.
ఏజెంట్ ఇచ్చిన షాక్ కి ఏడాది పాటు నెక్స్ట్ సినిమా చేయని అఖిల్ ఈసారి రెండు ప్రాజెక్ట్ లను ఒకేసారి షూటింగ్ కి తీసుకెల్తాడని తెలుస్తుంది.