Site icon HashtagU Telugu

Gundamma katha : డైలాగ్స్ నచ్చక.. ఎన్టీఆర్, ఏయన్నార్‌‌తో విజిల్స్‌ వేయించి సీన్ చేశారు..

Interesting Story behind Gundamma Katha Whistle scene between ntr and anr

Interesting Story behind Gundamma Katha Whistle scene between ntr and anr

తెలుగు ఇండస్ట్రీ(TFI)లో ఎన్ని కుటుంబ కథా చిత్రాలు వచ్చినా ‘గుండమ్మకథ'(Gundamma katha) స్థానాన్ని మాత్రం భర్తీ చేయలేవు. ఎస్వీ రంగారావు(SV Rangarao), ఎన్టీఆర్(NTR), ఏయన్నార్‌‌(ANR), సూర్యకాంతం, సావిత్రి(Savitri), జమున(Jamuna).. వంటి అగ్రతారలంతా కలిసి నటించి ఆ సినిమాని ఒక అద్భుతంగా మలిచారు. ఈ సినిమాకి కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించగా చక్రపాణి కథని, డివి నరసరాజు మాటలు అందించారు. ఇక ఈ సినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుండమ్మ అత్త ఆట కట్టించడానికి అన్నయ్య అయిన ఎన్టీఆర్ పనివాడిలా మారు వేషంలో వస్తే.. గుండమ్మ చిన్న కూతురికి (జమున) ముక్కు తాడు వెయ్యడానికి తమ్ముడు ఏయన్నార్‌‌ ప్రయత్నిస్తుంటాడు.

ఈ క్రమంలోనే ఒక సీన్ లో ఏయన్నార్‌‌.. జమున కోసం గుండమ్మ అత్త ఇంటికి వస్తాడు. ఆ సన్నివేశంలో ఏయన్నార్‌‌.. ఎన్టీఆర్ ని జమున ఎక్కడ ఉంది అని అడగాలి. ఇక ఆ సీన్ కోసం రచయిత డివి నరసరాజు మాటలు రాయడానికి చాలా ఇబ్బంది పడ్డాడట. ముందుగా ‘ఇంటిలో నా ప్రేయసి ఉందా?’ అని రాశారట. కానీ ‘ప్రేయసి’ చాలా బరువైన మాటలాగా అనిపించి.. ‘ఇంటిలో నా పిట్ట ఉందా?’ అని మార్చారు. అయితే ‘పిట్ట’ అనేది చీప్‌గా అనిపించడంతో అది కూడా వద్దు అనుకున్నారు. మరి ఎలా రాద్దాం అని ఆలోచిస్తుండగా నరసరాజు ఒక గమ్మత్తు అయిన ఆలోచన వచ్చింది. అసలు ఇలా మాటలు లేకుండా ‘ఇంట్లో తను ఉందా?’ అని ఈల వేస్తూ అడిగితే బాగుంటది అనిపించింది.

దీంతో వెంటనే ఆ సీన్ రాయడం మొదలు పెట్టారు. ఏయన్నార్‌‌ విజిల్ తో ప్రశ్న వేయగా ఎన్టీఆర్ విజిల్ తోనే సమాధానం ఇచ్చేలా రాసుకున్నారు. అయితే అలా ఈలతో సంభాషణ కేవలం ఆ రెండు డైలాగ్స్ వరకే రచయిత రాసుకున్నారు. అయితే కథ అందించిన చక్రపాణికి.. ఈ విజిల్స్‌ సంభాషణ బాగా నచ్చేసింది. దీంతో ఆ మొత్తం సీన్ ని విజిల్స్‌తోనే రాయమని అడగడంతో నరసరాజు రాసి ఇచ్చారు. ఇక థియేటర్ లో హీరోలు యాక్షన్స్ కి అభిమానులు ఈలలు వేస్తారు. అలాంటిది హీరోలే విజిల్స్ తో మాట్లాడితే ఇంకా ఎలా ఉంటది. సరైన డైలాగ్స్ దొరక్క విజిల్స్ తో రాసిన సీన్ థియేటర్ లో సూపర్‌ హిట్‌ అయింది.

 

Also Read : Ram Charan : మెగా కజిన్స్ కోసం చరణ్.. రామ్‌చరణ్‌ని కజిన్స్ అంతా ఏమని పిలుస్తారో తెలుసా..?