Site icon HashtagU Telugu

Dhanush: ధనుష్ గురించి సంయుక్త మీనన్ మాటల్లో..

In the words of Sanyukta Menon about Dhanush..

Samyukta

సంయుక్త మీనన్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే ‘భీమ్లా నాయక్’ ..’బింబిసార’ వంటి హిట్స్..ఆ తరువాత ఆమె చేసిన సినిమానే ‘సార్’. తమిళంలో ఈ సినిమాకి ‘వాతి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రెండు భాషల్లోనూ ఈ సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంయుక్త మీనన్ మాట్లాడుతూ .. ” నేను ‘భీమ్లా నాయక్’ సెట్ లో ఉండగానే, ‘సార్’ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ధనుష్ (Dhanush) సినిమాలో ఛాన్స్ .. పైగా ద్విభాషా చిత్రం .. అందువలన ఎంతమాత్రం ఆలోచించకుండా ఈ సినిమాను ఒప్పుకున్నాను” అన్నారు.

“ధనుష్ (Dhanush) గొప్ప స్టార్ .. మంచి నటుడు. ఆయనతో కలిసి నటించడం అంత తేలికైన పనేం కాదు. ఇక ఈ సినిమాలో నా పాత్రలో కాస్త రొమాంటిక్ యాంగిల్ ఉన్నప్పటికీ, ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందనేది ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతుంది .. ఆశ్చర్య పరుస్తుంది” అని చెప్పారు.

Also Read:  Poet: అదానీ స్పాన్సర్ చేస్తున్న పురస్కారాన్ని తిరస్కరించిన తమిళ కవయిత్రి