Prabhas సంక్రాంతి తర్వాత సమ్మర్ లో వచ్చే స్టార్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఏప్రిల్, మే నెలలో రిలీజైన సినిమాలు సెన్సేషనల్ హిట్లు, ఇండస్ట్రీ రికార్డులు అందుకున్నవి ఉన్నాయి. ఆ సెంటిమెంట్ తోనే స్టార్ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎప్పటిలానే ఈ సమ్మర్ కి ఏప్రిల్, మే సినిమాల రిలీజ్ ప్లాన్ చేశారు.
We’re now on WhatsApp : Click to Join
ఏప్రిల్ 5న ఎన్.టి.ఆర్ దేవర రిలీజ్ ప్లాన్ చేయగా.. మే 9న ప్రభాస్ కల్కి గా రాబోతున్నాడు. అయితే సమ్మర్ రేసు నుంచి దేవర దాదాపు తప్పుకున్నట్టే లెక్క. దేవర సైడ్ ఇవ్వడంతో ఫ్యామిలీ స్టార్ దిగుతున్నాడు. ప్రభాస్ కల్కి సినిమా కూడా మే 9న రిలీజ్ ఫిక్స్ చేశారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల పైన బడ్జెట్ తో భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది. సినిమా మే 9న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ మాక్సిమం ట్రై చేస్తున్నా కూడా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పూర్తి కాని పక్షంలో సినిమా రిలీజ్ వాయిదా వేస్తారని తెలుస్తుంది.
ఒకవేళ ప్రభాస్ కూడా మే 9న రాకపోతే మాత్రం సమ్మర్ స్టార్ సినిమాలు లేక చప్పబడుతుందని చెప్పొచ్చు. అయితే ఈ గ్యాప్ ని యువ హీరోల సినిమాలు ఫుల్ ఫిల్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ దేవర డేట్ ని విజయ్ దేవరకొండ ఆక్యుపై చేశాడు. కల్కి కూడా వాయిదా పడితే మరికొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసేలా ఉన్నాయి.
Also Read : Raviteja Eagle : ఈగల్ అసలు మ్యాటర్ దాచిపెట్టారా.. రవితేజ మాస్టర్ స్కెచ్ వర్క్ అవుట్ అవుతుందా..?